Share News

ఠారెత్తే ఎండలు

ABN , Publish Date - May 01 , 2024 | 11:54 PM

జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.

ఠారెత్తే ఎండలు

45 దాటిన ఉష్ణోగ్రతలు

వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి

ఖాళీగా రహదారులు, పర్యాటక కేంద్రాలు

కొలిమిగుండ్ల రూరల్‌, మే 1: జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలోని అనేక మండలాల్లో 45 డిగ్రీలు దాటింది. కొలిమిగుండ్ల, బనగానపల్లె, అవుకు మండలాల్లో అత్యధికంగా 46 డీగ్రీలు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 9నుండే ఎండ నిప్పులు కక్కింది. సాయంత్రం 5 దాటిని సూర్య ప్రకోపం చల్లారలేదు. దీంతో నిత్యం రద్దీగా వుండే రహదారులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆర్టీసీ బస్సులు, పర్యాటక కేంద్రాలు ఖాళీగా కనిపించాయి. బెలుంగుహల్లో పర్యాటకుల సందడి కానరావడం లేదు. సాధారణ రోజుల్లో రూ.30 నుండి 50వేల వరకు ప్రవేశ రుసుం ద్వారా ఆదాయం లభించే బెలుం గుహల్లో ప్రస్తుతం రూ.10 వేలకు మించడం లేదు. వచ్చే రెండు మూడు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల శాఖ సూచిస్తున్నది.

Updated Date - May 01 , 2024 | 11:54 PM