Share News

మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన: అఖిలప్రియ

ABN , Publish Date - May 02 , 2024 | 12:38 AM

ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోపై ప్రజలు ఆసక్తి చూపటం సహజమని, ఈ తరుణంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు కలిసి విడుదల చేసిన మ్యానిఫెస్టో చూసిన ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆళ్లగడ్డ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు.

మేనిఫెస్టోకు ప్రజల నుంచి స్పందన: అఖిలప్రియ

నంద్యాల, మే 1(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోపై ప్రజలు ఆసక్తి చూపటం సహజమని, ఈ తరుణంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు కలిసి విడుదల చేసిన మ్యానిఫెస్టో చూసిన ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆళ్లగడ్డ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆమె స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే రంజాన్‌, సంక్రాంతి, క్రిస్‌మస్‌ కానుకలను ఇవ్వడంతో పాటు దుల్హన్‌ పథకానికి ఈ సారి రూ.లక్ష అందజేస్తారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో వలంటీర్లుగా నియమితులైన ఉన్నత విద్యావంతులకు నెలకు రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచి జీతాలు పెంచుతారన్నారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన భూ హక్కు చట్టాన్ని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు.

‘రాక్షస పాలనకు అంతం పలకాలి’: వైసీపీ రాక్షస పాలనకు అంతనం పలకాలని మాజీ మంత్రి, టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, జనసేన పార్టీ ఇన్‌చార్జి ఇరిగెల రాంపుల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డ మండలంలోని నల్లగట్ల గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. కార్యక్రమంలో నల్లగట్ల గ్రామ టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి, గురప్పయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థిక స్వావలంబనకు టీడీపీ కృషి

శిరివెళ్ల: రాష్ట్రంలోని మహిళల ఆర్థిక స్వావలంబన కోసం టీడీపీ ఎనలేని కృషి చేస్తోందని మాజీ మంత్రి, ఆళ్లగడ్డ నియోజకవర్గ అభ్యర్థి భూమా అఖిల ప్రియ అన్నారు. మండల కేంద్రమైన శిరివెళ్లలోని 93, 95, 97, 98 బూత్‌ల పరిధిలో, వెంకటేశ్వరాపురం గ్రామంలో మహిళలతో ఆత్మీయ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అఖిలప్రియ మాట్లాడుతూ టీడీపీ.. బీజేపీతో పెట్టుకుందని, ప్రజలు వేసే ఓట్లు బీజేపీకి వెళ్తాయని వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ముస్లింలు గమనించాలన్నారు. గత టీడీపీ ప్రభు త్వంలో ముస్లింల సంక్షేమానికి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు అందిం చడంతో పాటు వారి అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. టీడీపీ అధికారం లోకి వచ్చినత తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మూడు పరిశ్రమలను స్థాపించి వాటి ద్వారా 5 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు. అనంతరం ప్రజాగళంలో భాగంగా వెంకటాపురం, వీరారెడ్డిపల్లె గ్రామాల్లో రోడ్‌ షో నిర్వహించారు. నియోజకవర్గ అబ్జర్వర్‌ ఉమ్మి సలీం, శ్రీకాంత్‌రెడ్డి, మురళి, ఖాజా హుసేన్‌, సూరా రామ, ఫిదా హుసేన్‌, బీఎండీ రఫి, అబూబకర్‌ సిద్ధిఖ్‌, వెంకటసుబ్బయ్య, ఖండె శ్యాంసుందర్‌లాల్‌, ఖండె ఆనంద్‌ గురూజీ, కరీం, జిక్రియా, షఫీవుల్లా, సాదక్‌, సూరా రాజ, లింగన్న గౌడ్‌, మద్దిలేటి, తానీషా, పీపీ లింగమయ్య పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:38 AM