Share News

మహానందిలో చిరుతపులి సంచారం

ABN , Publish Date - May 02 , 2024 | 12:38 AM

మహానంది సమీపంలోని దేవస్థానం గోశాల పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున చిరుతపులి సంచరించినట్లు గోశాల కాపాలదారులు తెలిపారు.

 మహానందిలో చిరుతపులి సంచారం

మహానంది, మే 1: మహానంది సమీపంలోని దేవస్థానం గోశాల పరిసరాల్లో బుధవారం తెల్లవారుజామున చిరుతపులి సంచరించినట్లు గోశాల కాపాలదారులు తెలిపారు. గోశాలకు అత్యంత సమీపంలో నల్లమల అడవి ఉండటంతో చిరుతపులి గోశాలలోని గోవులను ఆహారంగా తీసుకోవడానికి వచ్చివుండవచ్చుననే అనుమానాలు కూలీలు వ్యక్తం చేశారు. చిరుతపులి కొద్దిసేపు గోశాల పరిసరాల్లో పర్యటించిందని, అయితే చుట్టూ పకడ్బందీగా ముళ్లకంచ ఉండడంతో వీలు కుదరకపోవడంతో తిరిగి నల్లమలలోకి వెళ్లినట్లు తెలిపారు. కాగా అటవీశాఖ డీఆర్వో హైమవతి ఆధ్వర్యంలో సిబ్బంది చిరుతపులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు సేకరించారు. కొలతల ఆధారంగా చిరుతపులి అని తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 12:38 AM