Share News

మాట తప్పడం కాటసాని నైజం

ABN , Publish Date - May 02 , 2024 | 12:38 AM

ఎన్నికల ముందు హామీలిచ్చి మాట తప్పడం ఎమ్మెల్యే కాటసాని నైజం అంటూ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

మాట తప్పడం కాటసాని నైజం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

రాయల్టీ చెక్‌పోస్టు ఎత్తివేత హామీ ఏమైంది?

మెజార్టీ ఇచ్చిన గ్రామాలను గాలికొదిలేశావ్‌

ఎమ్మెల్యే కాటసానిపై బీసీ ఆగ్రహం

కొలిమిగుండ్ల రూరల్‌, మే 1: ఎన్నికల ముందు హామీలిచ్చి మాట తప్పడం ఎమ్మెల్యే కాటసాని నైజం అంటూ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం కొలిమిగుండ్ల మండలంలోని అంకిరెడ్డిపల్లె, కోరు మానుపల్లె, అబ్దులాపురం గ్రామాల్లో బీసీ జనార్దనరెడ్డి ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు చెందిన నాయకులు మాజీ ఎమ్మెల్యే బీసీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రాయల్టీ చెక్‌పోస్టు ఎత్తివేస్తామని బహిరంగ సభలో హామీ ఇచ్చి ఓట్లు దండుకొని మాటతప్పి నాపరాతి పర్రిశమ వర్గాలను మోసం చేశారని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా నాపరాయి పర్రిశ మపై అనేక రకాల అదనపు పన్నులు మోపి, పర్రిశమను నాశనం చేశారని ఆరోపించారు. సమస్యను కనీసం సిఎం దృష్టికి తీసుకవెళ్లలేని అసమర్థ ఎమ్మెల్యే అంటూ ఘాటుగా విమర్శించారు. గ్రామాల్లో నమ్మి వెంట నడిచిన నాయకులను, ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చిన గ్రామాలను ఏమ్రాతం పట్టించు కోకుండా విస్మరించడం కాటసానికే చెల్లిందని విమర్శించారు. వైసీపీ హాయాంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని తద్వారా సంక్షేమ పథకాలతో పాటు, అభివృద్ధి చేస్తామన్నారు. అమ్మవడి ఇంట్లో అందరి పిల్లలకు ఇస్తామని, పింఛన్‌ రూ.4వేలకు పెంచుతామని, ప్రతి మహిళకు ఏడాదికి రూ.18వేలు, 3గ్యాస్‌ సిలిండర్లు ఉచితం, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తదితర అనేక పథకాలు అందుతాయని బీసీ వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మూలే రామేశ్వరరెడ్డి, నంద్యాల రామేశ్వరరెడ్డి, పులి ప్రకాశ్‌రెడ్డి, ఇటిక్యాల బాలిరెడ్డి, నంద్యాల నారాయణరెడ్డి, అంబటి జయలక్ష్మీ రెడ్డి, కోరుమానుపల్లె ఓబయ్య, విజయ్‌, నరసింహారెడ్డి, అబ్దులాపురం వెంకటరామిరెడ్డి, భూపాల్‌, ఈశ్వరరెడ్డి, ఉలువల నరసింహుడు, కార్యకర్తలు పాల్గొన్నారు.

25 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరిక

బనగానపల్లె: బనగానపల్లె మండలం కటికవానికుంట గ్రామానికి చెం దిన 10 కుటుంబాలు, కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపేటకు చెందిన 15 కుటుంబాలు బుధవారం టీడీపీలో చేరాయి. వీరికి బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో బీసీ జనార్దన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 02 , 2024 | 12:40 AM