Share News

మొసలి కన్నీరు కార్చొద్దు

ABN , Publish Date - May 17 , 2024 | 12:42 AM

ఆళ్లగడ్డలో తమ ఇంటి ముందు తమ బాడీ గార్డ్‌ నిఖిల్‌పై జరిగిన హత్యాయత్నంపై వైసీపీ నాయకులు మొసలి కన్నీరు కార్చొ ద్దని మాజీ మంత్రి అఖిలప్రియ సూచించారు.

మొసలి కన్నీరు కార్చొద్దు

రౌడీ షీటర్లను రప్పించింది ఎవరో ఆధారాలు ఉన్నాయి

మాజీ మంత్రి అఖిలప్రియ

నంద్యాల, మే 16(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డలో తమ ఇంటి ముందు తమ బాడీ గార్డ్‌ నిఖిల్‌పై జరిగిన హత్యాయత్నంపై వైసీపీ నాయకులు మొసలి కన్నీరు కార్చొ ద్దని మాజీ మంత్రి అఖిలప్రియ సూచించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఆమె స్వగృహంలో గురువారం మాట్లాడుతూ నంద్యాలలో రెండేళ్ల క్రితం జరిగిన కానిస్టేబుల్‌ హత్య కేసులో నిందితుల్లో ఒకరిని వైసీపీ నాయకుడు కిశోర్‌రెడ్డి రప్పించి దొర్నిపాడు మండలం డబ్ల్యూ.కొత్తపల్లెలో ఏజెంటుగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించారని, ఇందుకు ఆళ్లగడ్ట తాలుకాలో ఓటు హక్కు లేని వ్యక్తికి అవకాశం లేదని ఎన్నికల అధికారులు చెప్పటంతో వెనుదిరిగారని అన్నారు. ఇలాంటి ఘటనలు విస్మరించి గంగుల ప్రభాక రరెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. తమ బాడీగార్డ్‌పై దాడి చేసుకోవడానికి తామే మనుషులను రప్పించుకున్నామని మాట్లాడడానికి సిగ్గుగా లేదా? అని మండిపడ్డారు. ఆళ్లగడ్డలో గత ఐదేళ్ల నుంచి జరిగిన గూండాయిజం, రౌడీయిజం, అక్రమాలు, కబ్జాలు వంటి వాటిని ఓర్వలేకనే ఇటీవల జరిగిన పోలింగులో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు వేశారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, యువత, వృద్ధులు ఓటు వేసేందుకు వేసవి ఎండలను సైతం లెక్క చేయలేదని అన్నారు. ఇది చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు రుద్రవరంలో వారంతా కార్లలో నుంచి కట్టెలు, సీసాలు బయ టకు తీసి దాడి చేసేందుకు సిద్ధమయ్యారని, ఇందుకు సంబంధించి ఆధా రాలున్నాయని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రజలంతా ఇలాంటి ఘట నలకు భయపడొద్దని, ప్రజలు సుఖశాంతులతో జీవించడానికి తమ వంతు సహకారం ఉంటుందని చెప్పారు.

Updated Date - May 17 , 2024 | 12:42 AM