Share News

పశ్చిమను అభివృద్ధి చేసి చూపుతా: సుజనాచౌదరి

ABN , Publish Date - May 02 , 2024 | 12:46 AM

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని టీడీపీ- జనసేన- బీజే పీ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనాచౌదరి హామీ ఇచ్చారు.

పశ్చిమను అభివృద్ధి చేసి చూపుతా: సుజనాచౌదరి
విద్యాధరపురంలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాతో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్న కూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి

విద్యాధరపురం, మే 1: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపుతానని టీడీపీ- జనసేన- బీజే పీ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనాచౌదరి హామీ ఇచ్చారు. బుధవారం టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగ వీటి రాధాకృష్ణతో కలిసి 39వ డివి జన్‌ విద్యాధరపురంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. సూపర్‌ సిక్స్‌ పథకాల కరపత్రాలను పం పిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనపై విసుగెత్తిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సుజనా అన్నారు. వైసీపీ పాలనలో కూల్చివేతలు, అరాచకాలు, అభ ద్రత, అశాంతి మినహా అభివృద్ధి, సంక్షేమం లేవన్నారు. అన్నిరంగాల్లో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టే సమయం ఎన్నికల రూపంలో వచ్చిందని విధ్వంస పాలనకు చరమగీతం పాడి కూటమి అభ్యర్థులను గెలిపిం చాలని కోరారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం ఎస్‌ బేగ్‌, ఎన్టీఆర్‌ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ పాల్గొన్నారు.

మహిళా సాధికారతే లక్ష్యం

మహిళా సాధికారతే లక్ష్యంగా పనిచేస్తానని సుజనా చౌదరి హామీ ఇచ్చారు. విద్యాధరపురం ఆర్టీసీ వర్క్‌షాపు రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాలులో ఆర్కే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళా సాధికారత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై నిర్వహించిన సెమినార్‌లో సుజనా మాట్లాడారు. మహిళా హక్కులను జగన్‌ ప్రభుత్వం కాలరాసిందన్నారు. సుజనా ట్రస్ట్‌ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పదివేల మందికి ఉద్యోగా వకాశాలు కల్పించామన్నారు. రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాజీ మేయర్‌ జంధ్యాల శంకర్‌, రోటరీ మాజీ గవర్నర్‌ రామారావు, శ్రామిక విద్యాపీఠం డైరెక్టర్‌ విద్యాకన్నా, ఆర్‌కే ఫౌండేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:46 AM