Share News

ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి: కలెక్టర్‌ దిల్లీరావు

ABN , Publish Date - May 02 , 2024 | 12:52 AM

అత్యంత పారదర్శకంగా ఎన్టీఆర్‌ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు తెలిపారు.

ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి: కలెక్టర్‌ దిల్లీరావు
ఆర్వోలు, ఎలక్షన్‌ ఏజెంట్లతో సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ దిల్లీరావు, జనరల్‌ అబ్జర్వర్లు మంజూరాజ్‌ సింగ్‌, నరీందర్‌ సింగ్‌ బాలి

కృష్ణలంక, మే 1: అత్యంత పారదర్శకంగా ఎన్టీఆర్‌ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజ కవర్గాలకు ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జనరల్‌ అబ్జర్వర్‌ మంజూరాజ్‌పాల్‌, నరీందర్‌సింగ్‌ బాలి సమ క్షంలో దిల్లీరావు ఆధ్వర్యంలో ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. రిటర్నింగ్‌ అధికారులతో పాటు ఎలక్షన్‌ ఏజెంట్లు, అభ్యర్థులు, అభ్యర్థుల ప్రతినిధులు హాజరయ్యారు. తొలి ర్యాండ మైజేషన్‌ ద్వారా ఈవీఎంలను నియోజకవర్గాలకు కేటా యించామన్నారు. బుధవారం రెండో ర్యాండమైజేషన్‌ ద్వారా ఈవీఎంలను ఆన్‌లైన్‌ ద్వారా పోలింగ్‌ స్టేషన్‌లకు అనుసంధానించినట్లు తెలిపారు. తిరువూరు నియోజకవర్గానికి 280 బ్యాలెట్‌ యూనిట్లు(బీయూలు), 280 కంట్రోల్‌ యూనిట్లు(సీయూలు), 304 వీవీ ప్యాట్లు, విజయవాడ పశ్చిమకు 303 బీయూలు, 303 సీయూలు, 328 వీవీ ప్యాట్లు, సెంట్రల్‌కు 642 బీయూలు, 321 సీయూలు, 346 వీవీ ప్యాట్లు, తూర్పుకు 357 బీయూలు, 357 సీయూలు, 387 వీవీ ప్యాట్లు కేటాయించినట్లు వివరించారు. మైలవరానికి 354 బీయూలు, 354 సీయూలు, 383 వీవీప్యాట్లు, నంది గామకు 266 బీయూలు, 266 సీయూలు, 288 వీవీ ప్యాట్లు, జగ్గయ్యపేటకు 266 బీయూలు, 266 సీయూలు, 288 వీవీ ప్యాట్లు కేటాయించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

రోజూ మధ్యాహ్నం 2 గంటలు అందుబాటులో ఉంటాం: అబ్జర్వర్లు

తాము రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు విజయవాడ లబ్బీపేట బృందావన కాలనీలోని మున్సిపల్‌ గెస్ట్‌హౌస్‌లో అందుబాటులో ఉంటామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, విజ్ఞాప నలను నేరుగా కలిసి సమర్పించవచ్చని జనరల్‌ అబ్జర్వర్లు మంజూరాజ్‌పాల్‌, నరీందర్‌ సింగ్‌బాలిలు తెలిపారు. మీడియా ద్వారా వెల్లడించిన ఫోన్‌ నెంబర్ల ద్వారానూ సంప్రదించవచ్చన్నారు. సువిధ యాప్‌ ద్వారా అనుమతులు, సీ-విజిల్‌ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, ఈసీఐ డిజిటల్‌ వేదికలపై జనరల్‌ అబ్జర్వర్లు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ పి.సంపత్‌కుమార్‌, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌పుండ్కర్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం నోఖ్వాల్‌, ఆర్వోలు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:52 AM