Share News

వైసీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం: గద్దె రామ్మోహన్‌

ABN , Publish Date - May 02 , 2024 | 12:48 AM

కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవు తుందని, రాష్ట్రంలో వైసీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ అన్నారు.

వైసీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయం: గద్దె రామ్మోహన్‌
16వ డివిజన్‌లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న కేశినేని చిన్ని, అమ్మిశెట్టి వాసు, బొప్పన భవకుమార్‌, గద్దె రామ్మోహన్‌

రామలింగేశ్వరనగర్‌, మే 1: కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవు తుందని, రాష్ట్రంలో వైసీపీ తుడిచి పెట్టుకుపోవడం ఖాయమని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ అన్నారు. నియోజకవర్గంలోని 16వ డివిజన్‌లో ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌తో కలిసి బుధవారం ఆయన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎన్నికల ప్రచారం చేశారు. పింఛన్‌ను రూ.4వేలకు పెంచి ప్రతి నెలా ఒకటో తేదీన అందిస్తామని గద్దె తెలిపారు. దివ్యాంగులను జగన్‌ విస్మరించారని, చంద్రబాబు దివ్యాంగులకు నెలకు రూ.6వేలు పింఛన్‌ ఇస్తామని ప్రకటించారన్నారు. సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కేశినేని చిన్నిని ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఉత్సహంగా పనిచేస్తున్నారని, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు వెళుతున్నారని కేశినేని చిన్ని అన్నారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. జనసేన నాయకుడు అమ్మిశెట్టి వాసు, బొప్పన భవకుమార్‌, శంకర్‌ బాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:48 AM