Share News

దూరంగా.. నిరుపయోగంగా!

ABN , Publish Date - May 01 , 2024 | 01:19 AM

లక్షలాది రూ పాయల ప్రజాధనంతో బాపులపాడులో నిర్మించిన ఆర్బీకే, వెల్‌నెస్‌ సెంటర్లు ప్రజలకు అక్కరకు రాకుం డా పోతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బాపులపాడు -3 సచివాల యం పరిధిలో సూరమ్మ చెరువు వద్ద రూ.20.8లక్షలు వ్యయంతో నిర్మించిన వెల్‌నెస్‌ సెం టర్‌, రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ. 23.9లక్షలు వ్యయంతో నిర్మించిన ఆర్బీకే సెంటర్‌ ప్రా రంభానికి నోచుకోలేదు. ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతో ఆ భవనా లు నిరుపయోగంగా పడి ఉన్నాయి.

దూరంగా.. నిరుపయోగంగా!
బాపులపాడు-3 సచివాలయం పరిధిలో సూరమ్మ చెరువు వద్ద నిర్మించిన ఆర్బీకే, వెల్‌నెస్‌ సెంటర్‌లు

ఫ నియోజకవర్గ ప్రజాప్రతినిధికి ఖాళీ లేక ప్రారంభానికి నోచుకోని ఆర్బీకే, వెల్‌నెస్‌ సెంటర్లు

ఫ రైతులకు, ప్రజలకు ఉపయోగం శూన్యం ఫ నాలుగేళ్లుగా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఫ లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా

హనుమాన్‌జంక్షన్‌, ఏప్రిల్‌ 30 : లక్షలాది రూ పాయల ప్రజాధనంతో బాపులపాడులో నిర్మించిన ఆర్బీకే, వెల్‌నెస్‌ సెంటర్లు ప్రజలకు అక్కరకు రాకుం డా పోతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బాపులపాడు -3 సచివాల యం పరిధిలో సూరమ్మ చెరువు వద్ద రూ.20.8లక్షలు వ్యయంతో నిర్మించిన వెల్‌నెస్‌ సెం టర్‌, రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ. 23.9లక్షలు వ్యయంతో నిర్మించిన ఆర్బీకే సెంటర్‌ ప్రా రంభానికి నోచుకోలేదు. ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతో ఆ భవనా లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఎన్నికలు వచ్చేస్తున్నాయని హడావిడి చేసి గత నెల 20వ తేదీన ఈ రెండు కేంద్రాలను ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు. చివరికి మాజీ ఎమ్మెల్యేకు వాటిని ప్రారంభించే సమయం లేకపోవడంతో ఈ రెండు కేంద్రాలు నిరుపయోగంగా పడిఉన్నాయి. 2021 సెప్టెంబరులో ఈ రెండు కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టి ఈ ఏడాది జనవరి నాటికి పూర్తి చేశారు. భవన నిర్మాణంపైనే అప్పట్లో అనేక విమర్శలు వె ల్లువెత్తాయి. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్మించలేదని పెదవి విరిచారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వెల్‌ నెస్‌ సెంటర్‌ ముళ్ల కంచెల మధ్య ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమ ర్శలకు గురైంది. దాదాపు రెండేళ్ల పాటు నత్తనడకగా పనులు సాగించి ఎన్నికలు షెడ్యూల్‌ ముందుకు వస్తుందని నెపంతో రంగులు వేశారు. ప్రజాప్రతి నిధుల నిర్లక్ష్యంతో వాటిని ప్రారంభించకుండానే వదిలేశారు. ఆలనాపాలన లేకపోవడంతో భవనాలు చుట్టు ముళ్లకంపలు పెరిగిపోయి చిట్టడవిని తలపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ప్రజానీకం పెదవి విరుస్తున్నారు.

Updated Date - May 01 , 2024 | 01:19 AM