Share News

ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:26 PM

ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి అని మదనపల్లె డీఎస్పీ ప్రసా ద్‌రెడ్డి పేర్కొన్నారు.

ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి
ఏఎస్‌ఐ రెడ్డెప్పను సన్మానిస్తున్న డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి

మదనపల్లె అర్బన, ఏఫ్రిల్‌ 30: ఉద్యోగులకు పదవీ విరమణ తప్పనిసరి అని మదనపల్లె డీఎస్పీ ప్రసా ద్‌రెడ్డి పేర్కొన్నారు. మంగ ళవారం స్థానిక టూటౌన పోలీసుస్టేషన సీఐ యువ రాజు అధ్యక్షత గత 40 ఏళ్లు గా పోలీసు శాఖలో పని చేసి పదవీవిరమణ చేసిన ఏఎస్‌ఐ రెడ్డెప్పను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహ ణలో ఏఎస్‌ఐ రెడ్డెప్ప చేసిన సేవలను కొనియాడారు. కార్యక్ర మంలో ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, ఏఎస్‌ఐలు ఇమామ్‌సాహెబ్‌, వైవి రమణ , చంద్రయ్య, బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

సీహెచవో లక్ష్మీపతి పదవీ విరమణ

పెద్దతిప్పసముద్రం ఏప్రిల్‌ 30 : పీటీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో సీహెచవోగా విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మీపతి మంగళవారం పదవీ విరమణ చేశారు. స్థానిక ఆసుపత్రి ఆవరణలో తోటి సిబ్బంది వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీపతి బార్య రాదమ్మను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఆసుపత్రి డాక్టర్లు పురు షోత్తం నాయక్‌, మహ్మద్‌ ఎస్దానీలు ఆయన సేవలను కొనియా డారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, ఎఎనఎంలు, ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:26 PM