Share News

ప్రశాంతంగా ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన

ABN , Publish Date - May 01 , 2024 | 11:58 PM

సార్వత్రిక ఎన్నికల కోసం వినియో గించాల్సిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల ఎంపిక కోసం బుధవారం పీలేరు తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌వో ఫర్మాన అహ్మద్‌ అధ్యక్షతన ర్యాండమైజేషన ప్రక్రియ నిర్వహించారు.

ప్రశాంతంగా ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన
ర్యాండమైజేషన ప్రక్రియను నిర్వహిస్తున్న ఆర్‌వో ఫర్మాన అహ్మద్‌

పీలేరు, మే 1: సార్వత్రిక ఎన్నికల కోసం వినియో గించాల్సిన ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల ఎంపిక కోసం బుధవారం పీలేరు తహసీల్దారు కార్యాలయంలో ఆర్‌వో ఫర్మాన అహ్మద్‌ అధ్యక్షతన ర్యాండమైజేషన ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల కమిషన ఆదేశాల మేరకు పలు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయన ఈ ప్రక్రియ ను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ కేంద్రానికి కేటాయిం చాల్సిన పోలింగ్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌ మెషీన్ల ఎంపిక కోసం ర్యాండమైజేషన ప్రక్రియ నిర్వహిస్తారని, ఎంపికైన మెషీన్ల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేస్తామని, పోలింగ్‌ రోజున వారు తమ పోలింగ్‌ కేంద్రాలకు ఆయా మెషీన్లు వచ్చాయో లేదో సరిచూసుకోవచ్చన్నారు. అదే విధంగా ఎంపిక చేసినమెషీన్లకు గురువారం ఉదయం 7 గంటలకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశా లలోని సా్ట్రంగ్‌ రూములో కమిషన చేస్తామన్నారు. దాంతో ప్రతి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాల్సిన మెషీన్ల ఎంపిక పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఆర్‌వోలు మహబూబ్‌ బాషా, ఖతీజున ఖుఫ్రా, విజయకుమారి, ప్రియదర్శిని, ప్రదీప్‌, శ్రీనివాసులు, ఏఎస్‌వో రామ్మోహన, డీటీ సుబ్రహ్మణ్యం, టీడీపీ నేత సుబహాన, బీఎస్‌పీ నేత వెంకరరమణ, కాంగ్రెస్‌ నేత శ్రీకాంత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:58 PM