Share News

కార్యక్రమాల వివరాలు అప్‌డేట్‌ చేయాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 10:35 PM

ఆరోగ్య కార్యక్రమాల వివరాలు ఆనలైనలో అప్డేట్‌ చేయాలని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కొండయ్య ఆదేశించారు.

కార్యక్రమాల వివరాలు అప్‌డేట్‌ చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కొండయ్య

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కొండయ్య

రాయచోటిటౌన, ఏప్రిల్‌30: ఆరోగ్య కార్యక్రమాల వివరాలు ఆనలైనలో అప్డేట్‌ చేయాలని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ కొండయ్య ఆదేశించారు. మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అన్నమయ్య జిల్లాలోని 48 పీహెచసీల పట్టణ ఆరోగ్య కేంద్రాల హెచఐ ఎంఎస్‌ (ఆరోగ్య సమాచార నిర్వహణ వ్యవస్థ) నోడల్‌ అధికారుల నెలవారీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచసీలో వైద్యాధికారుల తర్వాత రిపోర్టులు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తాయని అదే సమయంలో ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లాకు రోజు వారీ, వారం, పక్ష, నెలవారీ నివేదికలు ఆనలైన చేయడంలో నిర్లక్ష్యంగా ఉండరాదని సూచించారు. ప్రతి పీహెచసీ నోడల్‌ అధికారి వారి పీహెచసీ రిపోర్టులు పెండింగ్‌ లేకుండా చూసుకో వాల్సిన బాధ్యత వారిదేనన్నారు. అనంతరం డీపీఎంవో డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ మాట్లాడుతూ హెచఎంఐఎస్‌ పోర్టల్‌, ఆర్‌సీహెచ పోర్టల్‌, పీఎంవీవీవై అమలులో ఉన్న అన్ని పోర్టల్స్‌లో సమా చారాన్ని ఏ రోజుకు ఆ రోజు అప్‌లోడ్‌ చేయాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో హెల్త్‌ ప్రొఫెషనల్‌ రిజిస్ర్టేషన ఐడీలు చేసు కోవాలని ఆదేశించారు. ప్రస్తుతం వాతావరణంలో ఎండలు ఎక్కువుగా ఉన్నందున వడదెబ్బ, వడగాలులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, వీటికి గురికాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విరివిగా అవగాహన సమావేశాలు నిర్వహించా లన్నారు . నిర్దేశించిన ప్రాంతాల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్స్‌ నిర్దేశించిన చోట నిల్వలు ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐవో డాక్టర్‌ ఉషశ్రీ, ఎస్‌వో ఓబుల్‌రెడ్డి, డీపీవో మునీశ్వర్‌, ఏపీ దేమోలాజిస్ట్‌ వెంకటేశ, జిల్లాలోని వివిధ పీహెచసీల నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి తప్పనిసరి

ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేటు ఆసుపత్రులను నిర్వహిస్తే చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ కొండయ్య హెచ్చరించారు. మంగళ వారం ఆయన డీపీఎంవో డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌, డీఎనఎంవో డాక్టర్‌ విష్ణువర్థనరెడ్డితో కలిసి అన్నమయ్య జిల్లా కేంద్రంలో శ్రీవెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. ఏపీఎంసీఈ చట్టం 2002 ప్రకారం ప్రొటోకాల్‌ అనుసరిస్తేనే ఆసుపత్రులకు అనుమతి ఇస్తామని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో పార్కింగ్‌ ప్రదేశంతో పాటు రోగులు వేచి ఉండు గది, పొల్యూషన సర్టిఫికెట్‌, బయోవేస్టేజ్‌ నిర్వహణ, ఫైర్‌ఎనవోసీ, బిల్డింగ్‌ ప్లాన అప్రూవల్‌, వైద్యుల, పారామెడికల్‌ సిబ్బంది వివరాలు వారి సర్టిఫికెట్లు, మంచినీటి సౌకర్యం, ప్రమాదాల నిర్వహణ, శానిటేషన, ఆసుపత్రిలో ఉన్న వార్డులు, పడకలు, ల్యాబ్‌, ఆపరేషన థియేటర్‌ నిర్వహణ, జనరేటర్‌ ఏర్పాటు మొదలైనవి పరిశీలించారు. ప్రజల ఆరోగ్య భద్రత విషయంలో ప్రైవేటు ఆసుపత్రులు నిర్దేశించిన ప్రమాణాలు పాటించకుంటే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Apr 30 , 2024 | 10:35 PM