Share News

కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , Publish Date - May 01 , 2024 | 11:53 PM

కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన, తంబళ్లపల్లె సివిల్‌ కోర్టు న్యాయాధికారి ఉమర్‌ఫరూక్‌ పేర్కొన్నారు.

కార్మిక చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
బి.కొత్తకోటలో ర్యాలీ నిర్వహిస్తున్న సీపీఐ నాయకులు

తంబళ్లపల్లె, మే 1: కార్మికులు హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన, తంబళ్లపల్లె సివిల్‌ కోర్టు న్యాయాధికారి ఉమర్‌ఫరూక్‌ పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఐటీఐలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులు, చట్టాలు, కార్మికుల పనికి సంబంధించిన విషయాలతో పాటు లోక్‌అదాలత గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసుల రెడ్డి, ఇనస్ట్రక్టర్లు రమణ, సురేంద్ర, అశోక్‌ కోర్టు సిబ్బంది గురుప్రసాద్‌, ఇర్ఫాన, కార్మికులు పాల్గొన్నారు.

మదనపల్లె టౌన/అర్బనలో: ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బుధవారం మదనపల్లె పట్టణంలో కార్మిక సంఘాలు ఘనంగా మేడే ఉత్సవాలు నిర్వహించారు. స్థానిక టమోటా మార్కెట్‌ వద్ద టీఎనటీ యూసీ ఆధ్వర్యంలో టీడీపీ మైనారిటి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఏ మస్తాన టీఎనటీయూసీ జెండా ఎగురవేసి కార్మికుల సమస్యలు పరిష్కరించేంది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. అలాగే స్థానిక ప్రభుత్వా స్పత్రి వద్ద ఐటీయూసీ డివిజన కన్వీనర్‌ జి.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మేడే నిర్వహించారు. ప్రైవేటు, కార్పొరేట్‌ సంస్థలు కార్మికుల కష్టాన్ని దోచుకుతింటున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో మౌలాలి, తుల సికృష్ణ, నాగేశ్వర, పాండు, మనోహర్‌, రెడ్డెప్ప పాల్గొన్నారు. మేడే పుర స్కరించుకుని శిశుసంక్షేమశాఖ వద్ద సీఐటీయూ జిల్లా కోశాధికారి హరేంద్రాథ్‌శర్మ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి అనంతరం కార్మికులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన నాయకురాలు మధురవాణి పాల్గొన్నారు. నీరుగట్టువారి పల్లె మార్కెట్‌ యార్డు వద్ద ఆటో యూనియన, ఎద్దుల బండ్ల యూని యన ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు నాయకులు నాగరాజ, గోపాల్‌, పాల్గొన్నారు. మదనపల్లె బిల్డింగ్‌ వర్కర్స్‌ అసోసియేషన కార్యా లయంలో అధ్యక్షుడు జెశ్రీనివాసులు, యూనియన నాయకులు బీవీ రమణ, మోదీనబాషా, మేస్త్రీలు, సీపీఐ మురళి వేడుకలు నిర్వహించారు.

నిమ్మనపల్లిలో: శ్రామికుల జీవితాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టినది మేడే అని ప్రజాసేవాసంస్థ అధ్యక్షుడు సహదేవ పేర్కొన్నారు. బుధవారం మే డే సంధర్బంగా స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. 1886లో షికాగో మార్కెట్‌ తొలిసారిగా మేడే వేడుకలు జరుపుకొని కార్మికులంటే ప్రపంచానికి తెలియజేశారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికులపై చిన్నచూపు చూస్తూ వారిని పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో ముబారక్‌, రెడ్డెప్ప, వెంకట రమణ, సుదాకర్‌, యర్రయ్య, సోము, రమణ, శంకర పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: బి.కొత్తకోట పట్టణంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ను ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ, సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని దిగువబస్టాండు, పీటీయంరోడ్డు సర్కిల్‌లలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. కార్యక్రమాలలో ఏఐటీయూసీ నాయకులు వేణుగోపా ల్‌రెడ్డి, సలీంబాషా, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మనోహర్‌రెడ్డి లు మాట్లాడుతూ కార్మికులు, పేదల పక్షాన నిలబడి వారి హక్కుల సాధ నకై పాలకులను, ప్రభుత్వాలను నిలదీసే బలమైన గొంతుక ఎర్రజెండా అని అన్నారు. అనంతరం బ్యానర్లు చేతపట్టి పట్టణంలో ర్యాలీ నిర్వహిం చారు. వారికి రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఎన చంద్రశేఖ ర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు బషీర్‌ఖాన,రఘునాథ్‌,సమీవుల్లా, అష్రఫ్‌అలీ,అలివేలమ్మ, ఖాదర్‌బాషా, చౌడప్ప,బావాజాన షఫీ, సద్దాం తదితరులు పాల్గొన్నారు.

పీలేరులో: కార్మికుల పండుగ అయిన మేడేను బుధవారం పీలేరులోని పలు కార్మిక, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు, బిల్డింగ్‌ వర్కర్స్‌ సం ఘాలు ఘనంగా నిర్వహించారు. పీలేరు పంచాయతీ కార్యాలయం వద్ద సీఐటీయూ, యూటీఎఫ్‌, ఏఐటీ యూసీ, ఏఐవైఎఫ్‌, ఎస్‌టీయూ, డప్పు కళాకారుల సంఘ నాయకులు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. బహు జన బిల్డింగ్‌ వర్కర్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరుకులు వితరణగా అందజేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర పం చాయతీ కార్మికుల అసోసియేషన అధ్యక్షుడు వెంకటరామయ్య, యూటీ ఎఫ్‌ నాయకులు రాధాకృష్ణ, పురుషోత్తం, నాగరాజ, బిల్డింగ్‌ వర్కర్స్‌ అసోసి యేషన జిల్లా అధ్యక్షుడు బలరాం, ఏఐవైఎఫ్‌ నాయకులు టీఎల్‌ వెంకటేశ, ఏఐటీయూసీ నాయకులు నరసింహులు, ఎస్‌టీయూ నాయ కులు జగన్మోహనరెడ్డి, యశోద, సరస్వతి, రత్నమ్మ, శ్రీనివాసులు, భాస్క రరెడ్డి, పరదేశి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:53 PM