Share News

వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:23 PM

వైసీపీ పాలనలలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

 వైసీపీ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి
కురబలకోటలో రోడ్‌ షోలో ప్రసంగిస్తున్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

వివేకా హత్యకేసును ఇంత వరకు తేల్చలేదు

రామచంద్రయాదవ్‌పై దాడి చేయడం దుర్మార్గం మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

కురబలకోట, ఏప్రిల్‌ 30: వైసీపీ పాలనలలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవా రం మండలంలోని జంగావారిపల్లె నుంచి కుర బలకోట వరకు రోడ్‌ షో నిర్వహించారు. ఈ సం దర్భంగా కురబలకోటలో జరిగిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడుతూ సీఎం జగన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లు కావస్తున్న ఇప్పటి దాకా కేసును తేల్చలేదన్నారు. బీసీ నేత రామచంద్రయాదవ్‌ సొంత పార్టీ పెట్టు కుని సదుం మండలంలో పర్యటిస్తే పెద్దిరెడ్డి కుటుంబీకులు స్వయంగా పోలీస్టేషన ఎదుటే వాహ నాలను దగ్ధం చేశారని, ఈ దుశ్చర్యలకు పాల్పడిన వారిని ఇప్పటి దాకా అరెస్ట్‌ చేయడం లేదంటే శాంతిభద్రతలు ఏవిధంగా ఉన్నాయో మీరే అర్థం చేసుకోవాలన్నారు. ప్రశాంతతకు మారుపేరైన తంబళ్లపల్లె నియోజకవర్గంలో రౌడీయిజం వచ్చేసిందని, వాటిని అరికట్టడానికి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తంబళ్లపల్లె కూటమి అభ్యర్థి జయచంద్రారెడ్డి మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ నేత చల్లపల్లె నరసింహారెడ్డి, రాజంపేట బీజేపీ పార్లమెంటరీ ఇనఛార్జ్‌ సాయి లోకేష్‌, నియోజకవర్గ పరిశీలకుడు సీడ్‌ మల్లికార్జున నాయుడు, రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, మండల కన్వీనర్‌ వైజీసురేంద్ర, పార్లమెం టరీ తెలుగు యువత ప్రధానకార్యదర్శి అయూబ్‌బాషా, ఎల్లుట్ల మురళి, వెంకటరమణారెడ్డి, నజీబ్‌, వైజి రమణ, శ్రీనాథ్‌రెడ్డి, డిఆర్‌ వెంకటరమణారెడ్డి, శంకర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:23 PM