Share News

ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:27 PM

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని పరిశీలకురాలు కవిత మన్నికేరి సూచించారు.

ఎన్నికల నియమావళి తప్పక పాటించాలి

తంబళ్లపల్లె, ఏప్రిల్‌ 30: ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నియమావళిని తప్పక పాటించాలని పరిశీలకురాలు కవిత మన్నికేరి సూచించారు. మంగళవారం స్థానిక ఆర్వో కార్యాలయంలో ఎన్నికల వ్యయ పరిశీలకులు వైభవ్‌శుక్లాతో కలసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తు న్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీ నాయకుల చిత్రాలు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు ఉండకుండా అధికారులు చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్వో రాఘవేంద్ర, ఏఆర్వో బ్రహ్మయ్య, ఎంపీడీవో కృష్ణమూర్తి, ఎన్నికల అధికారులు, పలువురు అభ్యర్థులు పాల్గొన్నారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

పీలేరు, ఏప్రిల్‌ 30: పీలేరు పట్టణంలోని ఏఎంసీ ప్రాంగణంలో ఉన్న సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘ పరిశీలకులు పరిశీలించారు. పోలీసు శాఖ పరిశీలకులు, ఐపీ ఎస్‌ అధికారి నవాజ్‌ అహ్మద్‌, రాజంపేట పార్లమెంటు ఎన్నికల వ్య య పరిశీలకులు, ఐఆర్‌ఎస్‌ అధికారి రవీంద్ర కుమార్‌, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గాల వ్యయ పరిశీలకులు ఎస్‌జీ మూన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన వారిలో ఉన్నారు. ఏఎంసీ ప్రాంగణంలోని పోలింగ్‌ కేంద్రాలు 224, 266, 267, 262, 263, 268, 269 సమస్మాత్మకంగా ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటిని సందర్శించినట్లు వారు తెలిపారు. కార్యక్ర మంలో ఏఆర్‌వో మహబూబ్‌ బాషా, ఆర్‌ఐ చాణక్య పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:27 PM