Share News

బీటీ కళాశాలలో ఫోర్‌మెన కమిటీ విచారణ

ABN , Publish Date - May 01 , 2024 | 11:59 PM

బీటీ కళాశాల ప్రభుత్వ పర మైనప్పటి నుంచి అక్కడ దశాబ్దాలుగా పనిచేసిన ఆరు గురు ఒప్పంద ఉద్యోగుల పర్మనెంట్‌ విషయమై బుధ వారం హయ్యర్‌ ఎడ్యుకేషన నుంచి నలుగురు కమిటీ సభ్యులు విచారణ జరిపారు. బీటీ ప్రభుత్వ డిగ్రీ కళా శాలకు చేరుకుని విచారణ చేపట్టారు.

బీటీ కళాశాలలో   ఫోర్‌మెన కమిటీ విచారణ

రహస్య విచారణ మతలబు ఏమిటి..?

విద్యార్థి సంఘాల ఆందోళన

మదనపల్లె టౌన, మే 1: బీటీ కళాశాల ప్రభుత్వ పర మైనప్పటి నుంచి అక్కడ దశాబ్దాలుగా పనిచేసిన ఆరు గురు ఒప్పంద ఉద్యోగుల పర్మనెంట్‌ విషయమై బుధ వారం హయ్యర్‌ ఎడ్యుకేషన నుంచి నలుగురు కమిటీ సభ్యులు విచారణ జరిపారు. బీటీ ప్రభుత్వ డిగ్రీ కళా శాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ విషయమై విచారణ కమిటీ సభ్యులకు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థి సంఘాలను కళాశాల లోనికి అనుమతిం చలేదు. దీంతో వారు గేటు ముందే మాట్లాడుతూ అర్హత లేని వారిని బోధన సిబ్బందిగా నియమించుకున్నారని, అర్హులైన ఆరుగురు బోధనేతర సిబ్బందికి అన్యాయం చేస్తున్నారన్నారు. తమను కళాశాలలోకి అనుమతించ కుండా రహస్యంగా విచారణ చేపట్టడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. అర్హులకు న్యాయం చేయకుంటే ఎన్నికల కోడ్‌ అనంతరం ఆందోళనలు ఉదృతం చేస్తామ న్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఉత్తన్న, బీవైఎస్‌ పునీ త, గంగరాజు, నవీన, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ఫ చెల్లెలి ఇంటికి వచ్చి అక్క అనంతలోకానికి..

పెద్దతిప్పసముద్రం మే 1 : కరెంట్‌ షాక్‌కు గురై ఓ మహిళ మృతి చెందిన సంఘటన పీటీఎం మండలం కాట్నగల్లు పంచాయతీ దూలంవారిపల్లెలో చోటు చేసు కుంది. స్థానికుల సమాచారం మేరకు దూలంవారిపల్లెకు చెందిన దూలం శ్రీనివాసులురెడ్డి భార్య గీతమ్మది పుట్టినిల్లు ఓడిసి. ఆమె అక్క అయిన మంజుల (46) ను నల్లచెరువు మండలం రాగన్నగారిపల్లెకు ఇచ్చారు. కాగా గత కొన్ని సంవత్సరాల క్రితం మంజుల భర్త మృ తి చెందాడు. అయితే తన చెల్లెలు అయిన గీతమ్మను చూసేందుకు దూలంవారిపల్లెకు ఇటీవల వచ్చింది. బుధవారం ఉదయం మంజుల స్నానం చేసేందుకు బాత్రూంలో హీటర్‌ స్విచ వేయడంతో ఒక్క సారిగా కరెంట్‌ షాక్‌తో కింద పడిపోయింది. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్దారిం చారు. ఆమె మృతదేహాన్ని నల్లచెరువు మండలం రాగన్న గారిపల్లెకు తరలించి దహనక్రియలు నిర్వహించినట్లు కుటుంబీకులు తెలిపారు.

Updated Date - May 01 , 2024 | 11:59 PM