Share News

వైసీపీకి పొలిటికల్‌ హాలిడే ప్రకటించండి

ABN , Publish Date - May 02 , 2024 | 01:47 AM

కోనసీమలో క్రాప్‌హాలిడే ప్రకటించినట్టుగా వైసీపీకి ఈ ఎన్నికల్లో పొలిటికల్‌ హాలిడే ప్రకటించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు.

వైసీపీకి పొలిటికల్‌ హాలిడే ప్రకటించండి

మండపేటలో పవన్‌కల్యాణ్‌ పిలుపు

రైతులకు మద్దతు ధర లేదు..

గంజాయికి మాత్రం ఉంది

సహజ వనరులపై అజమాయిషీ చేస్తే తొక్కేస్తా

వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుపైనా ధ్వజం

తోట, పిల్లి కలయిక రాజకీయ అవకాశవాదం

కూటమి అభ్యర్థులను గెలిపించండి

మండపేట, మే 1: కోనసీమలో క్రాప్‌హాలిడే ప్రకటించినట్టుగా వైసీపీకి ఈ ఎన్నికల్లో పొలిటికల్‌ హాలిడే ప్రకటించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోన సీమ జిల్లా మండపేట కేపీ రోడ్డులో బుధవారం అమలాపురం ఎంపీ టీడీపీ అభ్యర్థి హరీష్‌ మాధుర్‌, మండపేట అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల సభలో మండు టెండలో పవన్‌ గంటపాటు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపైన, వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు అక్రమాలపైనా విరుచుకుపడ్డారు. ఇక్కడ 50 రైస్‌మిల్లులు ఉన్నాయి. కానీ రైతులు నష్టాల్లో ఉన్నారు. వైసీపీ నాయకులు అమ్మకాలు సాగించే గంజాయికి మాత్రం గిట్టు బాటు ధర ఉంది. వేలకోట్ల అమ్మకాలూ సాగుతాయి. సినిమా టిక్కె ట్లకు అధికారులు వస్తారు.. కానీ గంజాయి నిర్మూలనకు రారని ధ్వజ మెత్తారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా రైతులకు మద్దతు ధర ఇవ్వలేదు. మూడు వేల మంది రైతులు చనిపోయారు. వ్యవసాయంలో రాయి తీలు తీసేశారు. ఈ రోజున ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే దాడులు తప్ప సమాధానం లేదు. 2020లో హుద్‌హుద్‌ తుఫాన్‌ కార ణంగా రూ.250 కోట్ల మేర పంటనష్టం వాటిల్లినా పరిహారం ఇవ్వ లేదు. తెలంగాణలో వరిసాగు పెరుగుతుంటే అన్నపూర్ణ ఆంధ్రలో మాత్రం వరి సాగు తగ్గింది. మద్దతు ధర ఇవ్వరు.. చివరకు రైతులిక్కడ క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. దీనికి సమాధానంగా వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్‌ హాలిడే ఇవ్వాలని పవన్‌ పిలుపునిచ్చారు. జగన్‌కు నెలకు పది కోట్లు వంతున కపిలేశ్వరపురం, తాతపూడి, కోరుమిల్లి కేదార్లంక ఇసుక ర్యాంపుల నుంచి వెళ్లిందని ఆరోపించారు. అదే డబ్బుతో ఇప్పుడు ఓట్లు కొంటున్నాడన్నారు. జగన్‌.. ఇప్పుడు క్లాస్‌ వార్‌ అంటూ అందరినీ కలిపి దోచేయడం కాదు...సీఎం దోస్తున్నాడా. పవన్‌ దోస్తున్నాడా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రకృతిలో పంచభూ తాలు అందరివి. మేడే రోజున చెబుతున్నా.. సహజ వనరులపై అజమాయిషీ చేస్తే అథః పాతాళంలోకి తొక్కేస్తా..తోట త్రిమూర్తులుకూ చెబుతున్నా అంటూ పవన్‌ ధ్వజమెత్తా రు. కూటమి అన్నదమ్ముల ను కలుపుతుంటే వైసీపీ మాత్రం జగన్‌ కుటుంబాన్ని విడదీస్తోందని పవన్‌ అన్నా రు. కొత్తపేటలో బండారు బ్రదర్సు ఇద్దరు వేర్వేరుగా ఉంటే.. వారిని కూటమి ఒక్కటి చేసిం దన్నారు. జగన్‌ మాత్రం తన కుటుంబంలో చెల్లిని, తల్లిని విడదీస్తే తమ కూటమి అన్నదమ్ములను కలిపిందన్నారు. తనకు ఎవరిమీద ద్వేషం ఉండదన్నారు. కాపు కులం వాడుకున్న ఇక్కడి వైసీపీ అభ్యర్థి తోట కాపులకు చేసిందేమీ లేదన్నారు. ద్రాక్షారామలో దేవదాయ శాఖకు చెందిన భూమిని కాపు కమ్యూనిటీ హాల్‌ కోసం సేకరిస్తే ఆ భూమి తోట చేతుల్లోకి వెళ్లిందన్నారు. కాపు యువతనుద్దేశించి మా ట్లాడుతూ మీరు పాతతరంలాగా మోసపోకండని హితవు పలికారు. రామచంద్రపురంలో 30 ఏళ్లపాటు శత్రువులుగా ఉన్న ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, తోట త్రిమూర్తులు కలవడం వారి అవకాశవాదానికి అద్దంపడుతోందన్నారు. ఈ ఇద్దరు నేత లు జొన్నాడ, యానాం మధ్య ఏటిగట్టును ఆధునీకరించడంలో ఎందుకు చొరవ చూపలేకపోయారని ప్రశ్నిం చారు. వారిద్దరూ రాజకీయ అవసరాలకు కలిశారు. తోట జనసేనలోకి రావడం లేదు. నాకు సంకేతాలు పంపలేదని పవన్‌కల్యాణ్‌ స్పష్టంచేశారు. మండపేటలో ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన వివాదాన్ని ప్రస్తా విస్తూ కూటమి ఉంటే అలా జరుగుతుందా, కూటమి ప్రభుత్వం ఉంటే తాను తాట తీస్తానని పేర్కొన్నారు. వైసీపీ కాకినాడ సిటీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఇంటిలో మూడు పదవులు ఉన్నాయని, ఇప్పుడు వారే రైతులను దోచేస్తున్నారని ఆరోపించారు. కూటమి అభ్యర్థులకు ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. వైసీపీని తరిమి తరిమికొట్టాలన్నారు. నియోజ కవర్గం నలుమూలల నుంచి కూటమి నేతలు, జనసేన ఇన్‌చార్జిలు వేగుళ్ల లీలాకృష్ణ, పోలిశెట్టి చంద్రశేఖర్‌, బండారు శ్రీనివాసరావు, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌. నల్లమిల్లి వీర్రెడ్డి, బీజేపీ నేత కోటిపల్లి సాయిరాం, టీడీపీ నేత వి.సాయికుమార్‌బాబు, అధిక సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 01:47 AM