Share News

కార్మిక హక్కులు హరణం

ABN , Publish Date - May 02 , 2024 | 12:43 AM

ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హారిస్తున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం(మే డే)ను బుధవారం పలుచోట్ల సీఐటీయూ, అంగన్వాడీ, ఆశా, భవన నిర్మాణ, కార్మిక సం ఘం, మున్సిపల్‌, రిక్షా, జట్టు వర్కర్స్‌, ఫ్యాక్టరీ వర్కర్స్‌ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

కార్మిక హక్కులు హరణం
తాళ్లపూడిలో మేడే వేడుకల్లో సీఐటీయూ కార్మికులు

  • కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విమర్శ

  • ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవం

  • మేడే పతాకాల ఆవిష్కరణ.. కార్మిక అమరవీరులకు నివాళి

కొవ్వూరు, మే 1: ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హారిస్తున్నాయని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం(మే డే)ను బుధవారం పలుచోట్ల సీఐటీయూ, అంగన్వాడీ, ఆశా, భవన నిర్మాణ, కార్మిక సం ఘం, మున్సిపల్‌, రిక్షా, జట్టు వర్కర్స్‌, ఫ్యాక్టరీ వర్కర్స్‌ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొవ్వూరు బస్టాండ్‌ సెంటర్‌లో సీఐటీయూ, స్థూపం వద్ద జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు, కోరమండల్‌ కాంక్రీట్‌ వర్కర్స్‌ యూ నియన్‌ ఆధ్వర్యంలో బీరా రవి, అల్లూరి సీతారామరాజు విగ్రహం, పుంతలో ముసలమ్మ గుడి వద్ద సాయి గణేష్‌ పెయింటర్స్‌ యూనియన్‌ వద్ద సిద్దిరెడ్డి బాపిరాజు, బాపూజీ కూగాయల మార్కెట్‌ జట్టు కార్మికులు, కొవ్వూరమ్మ ఆల యం, చైతన్య తాపీ వర్కర్స్‌ యూనియన్‌ కార్యాలయం వద్ద మైగాపుల నాగేశ్వరరావు, మండలంలోని సీతంపేట, విజ్జేశ్వరం, వాడపల్లి, పశివేదల, దొమ్మేరు గ్రామాల్లో ఆయా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కార్మికులు మేడే పతాకాలను ఎగురవేశారు. చికాగో అమరవీరులకు నివాళులర్పించారు. సుందరబాబు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కులకు భంగం కలిగించి లేబర్‌కోడ్‌లు రద్దు అయ్యే వరకు, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం సెస్సు నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగించే వరకు పోరాడుతామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కాకుండా, కార్మికులకు కనీస వేతనాలు అమలు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీహెచ్‌.మాణిక్యాంబ, మద్దుకూరి దొరయ్య, పెనుమాక జయరాజు, కె.వీరబాబు, మాణికిరెడ్డి హరిబాబు, జొన్నల రాంబాబు, మైగాపుల నాగేశ్వరరావు, రేఖ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి సూర్యవెంకట మహర్షి మాట్లాడుతూ పదేళ్లుగా దేశంలో కార్మిక హక్కులు హరించబడుతున్నాయన్నారు. ఉపాధి లేక అసంఘటితరంగ కార్మికులు అల్లాడిపోతున్నారన్నారు. వారందరికీ ఉపాధి కల్పించి ఆదుకోవాలన్నారు. పంగిడిలో ఐఎఫ్‌టీయూ నాయకుడు పి.నాగేశ్వరరావు కార్మిక పతాకాన్ని ఎగురవేశారు. క్వారీ, లారీ వర్కర్లకు యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనల మేరకు వేతనాలు చెల్లించడంలేదన్నారు. నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దుచేసి, కార్మికులకు పనిచేసే ప్రాంతాల్లో చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో గాడి రమేష్‌, శ్యాం, పోసియ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:43 AM