Share News

నేడు హోం ఓటింగ్‌!

ABN , Publish Date - May 02 , 2024 | 12:57 AM

పోలింగ్‌ బూత్‌లకు రాలేని స్థితిలో ఉన్న 85 ఏళ్లు దాటినవారు, పీడబ్ల్యూడీ ఓటర్లు హోంఓటింగ్‌ విధానంలో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉంది. తొలివిడతగా గురువారం, రెండో విడతగా ఈనెల 8న ప్రత్యేక బృందాలు ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తాయని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

నేడు హోం ఓటింగ్‌!

85 ఏళ్లు దాటినవారు, పీడబ్ల్యూడీ ఓటర్లకు ఇంటి వద్దే ఓటు చాన్స్‌

రాజమహేంద్రవరం, మే 1 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ బూత్‌లకు రాలేని స్థితిలో ఉన్న 85 ఏళ్లు దాటినవారు, పీడబ్ల్యూడీ ఓటర్లు హోంఓటింగ్‌ విధానంలో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉంది. తొలివిడతగా గురువారం, రెండో విడతగా ఈనెల 8న ప్రత్యేక బృందాలు ఆయా ఓటర్ల వద్దకు వెళ్లి ఓటింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తాయని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. బుధవారం రాత్రి ఆమె ఒక ప్రకటన జారీచేశారు. ఎన్నికల కమిషన్‌ నిర్దేశిత మార్గ దర్శకాల ప్రకారం ఈ హోంఓటింగ్‌ ప్రకియ మొదలు పెట్టామన్నారు. జిల్లాలో హోం ఓటింగ్‌కు అంగీకరించిన వారు మొత్తం 1306 మంది ఉండగా, అందులో 85 ఏళ్లు దాటినవారు 648 మంది, పీడబ్ల్యూడీ ఓటర్లు 658 మంది ఉన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఈ విధానం కోసం 400 మంది సిబ్బందితో 69 బృందాలు ఏర్పాటుచేశామన్నారు. ఈ రెండు విడతల్లో ఓటు వినియోగించుకోకపోతే మే 13న కూడా ఓటుహక్కును వినియోగించుకోవచ్చన్నారు. హోంఓటింగ్‌ ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్‌ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారిణి మాధవీలత తెలిపారు. అనపర్తిలో 85 ప్లస్‌ ఓటర్లు 186, దివ్యాంగులు 222 ఉండగా, హోంఓటింగ్‌ కోసం 147 మందితో 21 బృందాలు ఏర్పాటుచేశారు. రాజానగరంలో 85 ప్లస్‌ 33 మంది, దివ్యాంగులు 67 మంది ఉండగా, వారికోసం 35 మందితో 7 బృందాలు ఏర్పాటు చేశారు. రాజమండ్రి సిటీలో 85 ప్లస్‌ 142 మంది, దివ్యాంగులు 65 మంది ఉండగా, వారికోసం 40 మందితో పది బృందాలు ఏర్పాటుచేశారు. రాజమహేంద్రవరం రూర ల్‌లో 85 ప్లస్‌ 51మంది, దివ్యాంగులు 56 మంది ఉండగా, వారికోసం 30 మందితో 5 బృందాలు ఏర్పాటుచేశారు. కొవ్వూరులో 85 ప్లస్‌ 66 మంది, దివ్యాంగులు 66 మంది ఉండగా, వారికోసం 40 మందితో 8 బృందాలు ఏర్పాటుచేశారు. నిడదవోలు లో 85ప్లస్‌ 130మంది, దివ్యాంగులు 145 మంది ఉండగా, వారి కోసం 72 మందితో 12 బృందాలు ఏర్పాటుచేశారు. గోపాలపురంలో 85ప్లస్‌ 40 మంది, దివ్యాంగులు 37 మంది ఉండగా, వారి కోసం 36 మందితో 6 బృందాలు ఏర్పాటుచేశారు. హోం ఓటింగ్‌ ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్‌ చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి తెలి పారు. కాగా హోంఓటింగ్‌కు కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ల్లోనూ ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 12:57 AM