Share News

టీడీపీతోనే బీసీలకు రాజకీయ గుర్తింపు

ABN , Publish Date - May 02 , 2024 | 12:44 AM

బీసీలకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ కుడిపూడి సత్తిబాబు అన్నారు. బుధవారం చాగల్లులో బీసీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు బీసీలకు 24శాతం రిజర్వేషన్‌లు కల్పించగా, చంద్రబాబు వాటిని 34శాతానికి పెంచి బీసీలు ఎంపీపీలు, సర్పంచ్‌లుగా పదవులు పొంది రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు.

టీడీపీతోనే బీసీలకు రాజకీయ గుర్తింపు

  • శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ కుడిపూడి

చాగల్లు, మే 1: బీసీలకు రాజకీయ గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ శెట్టిబలిజ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ కుడిపూడి సత్తిబాబు అన్నారు. బుధవారం చాగల్లులో బీసీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ రామారావు బీసీలకు 24శాతం రిజర్వేషన్‌లు కల్పించగా, చంద్రబాబు వాటిని 34శాతానికి పెంచి బీసీలు ఎంపీపీలు, సర్పంచ్‌లుగా పదవులు పొంది రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. టీడీపీ మేనిఫెస్టోలోను బీసీలకు 10శాతం నిధులు కేటాయిస్తామని చెప్పడం అభినందనీయన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీసీలందరూ ఐకమత్యంతో పరినిచేయాలన్నారు. అందులో భాగంగా ఈ నెల 5న రాజమహేద్రంవరంలోని జేకే గార్డెన్స్‌ సమీపంలో సాయంత్రం 5గంటలకు శెట్టిబలిజ, గౌడ బీసీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్టు కుడిపూడి సత్తిబాబు చెప్పారు. బీసీ వర్గాల వారందరూ హాజరై కార్యక్రమాన్ని మంను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేతా సాహెబ్‌, టీడీపీ నాయకులు పిల్లి శ్రీనినవాసరావు, దొంగ రామకృష్ణ, కట్ట సత్యన్నారాయణ, దాసరి నాగేశ్వరరావు, ఆనెం చిన్న, సంసాని ప్రసాద్‌, జుత్తుక వీరకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:44 AM