Share News

‘పేద విద్యార్థులను ప్రోత్సహిస్తాం’

ABN , Publish Date - May 02 , 2024 | 01:05 AM

కాకినాడ రూరల్‌, మే 1: ప్రతభ గల ఎస్సీ, ఎస్టీ పేద విదార్థులను విద్యాపరంగా ప్రోత్సహించడమే స్పృహ ఎడ్యుకేషనల్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌ (సీట్‌) లక్ష్యమని పాఠశాల విద్య అదనపు సంచాలకులు డాక్టర్‌ దుక్కిపాటి మధుసూదనరావు తెలిపారు. కాకినాడ గీతం పాఠశాలలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయ

‘పేద విద్యార్థులను ప్రోత్సహిస్తాం’

కాకినాడ రూరల్‌, మే 1: ప్రతభ గల ఎస్సీ, ఎస్టీ పేద విదార్థులను విద్యాపరంగా ప్రోత్సహించడమే స్పృహ ఎడ్యుకేషనల్‌ ఎంపవర్‌మెంట్‌ ట్రస్ట్‌ (సీట్‌) లక్ష్యమని పాఠశాల విద్య అదనపు సంచాలకులు డాక్టర్‌ దుక్కిపాటి మధుసూదనరావు తెలిపారు. కాకినాడ గీతం పాఠశాలలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రస్ట్‌ ద్వారా 2024-25 విద్యాసంవత్సరంలో ఇంటర్‌లో 100శాతం స్కాలర్‌షిప్‌తో చదివించేందుకు 2023-24లో పదోతరగతి ఉత్తీర్ణులై 525 మార్కులుపైబడి సాధించిన విద్యార్థుల నుంచి ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నామన్నారు. విద్యార్థులు స్పృహ ట్రస్ట్‌ ద్వారా ఇవ్వబడిన గూగుల్‌ లింక్‌ నందు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ ద్వారా దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు. ఈనెల 5 వరకూ దరఖాస్తుచేసుకోవచ్చని, 11న రాజమహేంద్రవరం సీతానగరం రోడ్డులోని తిరుమల పాఠశాలలో నిర్వహించే పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపికచేస్తామన్నారు. ఇంటర్‌ తరువాత ఐఐటీ, ఎన్‌ఐటీ, జేఎన్టీయూ,ఎయిమ్స్‌, జిప్‌మర్‌ వంటి జాతీయస్థాయి ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలల్లో చదివేటప్పుడు కూడా స్కాలర్‌షప్‌లు అందజేస్తామని తెలిపారు. వివరాల కోసం విద్యార్థులు 9959507507 నెంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు.

Updated Date - May 02 , 2024 | 01:05 AM