Share News

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

ABN , Publish Date - May 02 , 2024 | 01:42 AM

మేడే స్ఫూర్తితో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా కూటమిని బలపరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్క కార్మికుడు దేశం కోసం ఆలోచించాలని, దేశాన్ని రక్షించుకోవాలని, మతోన్మాదశక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 1 : మేడే స్ఫూర్తితో నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా కూటమిని బలపరచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్క కార్మికుడు దేశం కోసం ఆలోచించాలని, దేశాన్ని రక్షించుకోవాలని, మతోన్మాదశక్తుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బుధవారం మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో సీపీఐ, జట్లు లేబర్‌ యూనియన్‌, ఏఐటీయూసీ సంయుక్తంగా కార్మికులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎస్‌వీ మార్కెట్‌లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో సొంత చెల్లెలికి న్యాయం చేయలేని జగన్మోహనరెడ్డి రాష్ట్రాన్ని బాగు చేస్తాడా అని ప్రశ్నించారు. పులివెందులలో ఎవరిని అడిగినా వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ప్రతి ఒక్కరూ చెబుతారని అన్నారు. లౌకిక వ్యవస్థ ఉండదని స్వయంగా బీజేపీ కేంద్రమంత్రులే మాట్లాడడం దారుణమని అన్నారు. ఏ కేసు లేకపోయినా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో ఉంచారని, దీనిలో అమిత్‌షా హస్తం లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజమండ్రి పార్లమెంట్‌ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ స్టీల్‌ప్లాంటు పరిరక్షణ జరుగుతుందని అన్నారు. సీపీఐ నాయకులు అక్కినేని వనజ, తాటిపాక మధు మాట్లాడారు.

Updated Date - May 02 , 2024 | 01:42 AM