Share News

అపార్టుమెంటులో చీరలు, నగదు సీజ్‌

ABN , Publish Date - May 02 , 2024 | 03:08 AM

ఓటర్లకు పంపిణీ చేసేందుకు దాచిపెట్టిన రూ.23 వేల విలువ చేసే 46 చీరలను, రూ 1.22 లక్షల నగదును బుధవారం తిరుపతి ఎన్నికల ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అపార్టుమెంటులో చీరలు, నగదు సీజ్‌
సీజ్‌ చేసిన చీరలు, నగదు

తిరుపతి(నేరవిభాగం) మే 1 : ఓటర్లకు పంపిణీ చేసేందుకు దాచిపెట్టిన రూ.23 వేల విలువ చేసే 46 చీరలను, రూ 1.22 లక్షల నగదును బుధవారం తిరుపతి ఎన్నికల ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.యూనివర్శిటీ సీఐ మురళీకృష్ణ కథనం మేరకు...తిరుపతి ఎయిర్‌ బైపాస్‌ రోడ్డులోని మిథిన్‌ అపార్టుమెంటులో కాపురమున్న సురే్‌షబాబు ఇంటిలో చీరలు, నగదు దాచి వుంచారని సమాచారం అందింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు అపార్టుమెంటులో తనిఖీలు చేసి 46 చీరలను, రూ.1.22 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.అపార్టుమెంట్‌ యజమాని సురే్‌షబాబుతో పాటు విజయకుమార్‌, సత్యవతి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - May 02 , 2024 | 03:08 AM