Share News

పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి

ABN , Publish Date - May 02 , 2024 | 03:02 AM

సదుంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై దాడి చేసి విధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు.

పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి
ముఖేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేస్తున్న బీసీవై పార్టీ నేతలు

- సదుం ఘటనలో నిందితులను అరెస్టు చేయాలి - ఈసీకి బీసీవైపీ విజ్ఞప్తి

పుంగనూరు, ఏప్రిల్‌ 1: సదుంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్‌పై దాడి చేసి విధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేశారు. బుధవారం విజయవాడ ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో బీసీవై పార్టీ మంగళగిరి ఇన్‌చార్జి శివరాం, రాష్ట్ర నాయకురాలు చాముండేశ్వరిదేవి తదితరులు సీఈవోను కలిసి పుంగనూరు నియోజకవర్గం సదుంలో వైసీపీ అల్లరి మూకలు చేసిన దాడి, బీభత్సం గురించి వివరించారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు, ప్రధానంగా పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైప్లస్‌ భద్రత గల రామచంద్రయాదవ్‌కు పోలీసు భద్రత కల్పించకుండా వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడైన రామచంద్రయాదవ్‌పైనే హత్యాయత్నం కేసు పెట్టి, ఎన్నికలకు దూరం చేయాలని పోలీసులు కుట్ర చేశారని, పోలీ్‌సస్టేషన్‌పై వైసీపీ వారు దాడి చేసి స్టేషన్‌ ముందే ప్రచారరథం కాల్చివేశారని వివరించారు. న్యాయం కోసం అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతామని నాయకులు తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 03:02 AM