Share News

ప్రత్యర్థులకు నో ఎంట్రీ

ABN , Publish Date - May 02 , 2024 | 02:58 AM

రాజులు, రాచరికాలు పోయినా పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం ఇంకా ఆ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతాన్ని తన సామాజ్య్రంగా మార్చేసుకున్నారు.

ప్రత్యర్థులకు నో ఎంట్రీ
సదుం పోలీ్‌సస్టేషన్‌ ముందే బీసీవై పార్టీ ప్రచార రథాన్ని దగ్ధం చేసిన వైసీపీ మూకలు(ఫైల్‌ ఫొటో)

- పెద్దిరెడ్డి సామాజ్య్రంగా సదుం

- ఎదురు తిరిగినా, ప్రశ్నించినా దాడులే

- జీ హుజూర్‌ అంటున్న పోలీసులు

పుంగనూరు, మే 1: రాజులు, రాచరికాలు పోయినా పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం ఇంకా ఆ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతాన్ని తన సామాజ్య్రంగా మార్చేసుకున్నారు. ముఖ్యంగా సొంత మండలం సదుంలో ఆయన అనుమతి ఉంటే తప్పా ప్రత్యర్థులకు ప్రవేశం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఎదురుతిరిగినా, ప్రశ్నించినా దాడులతో సమాధానం చెబుతున్నారు. రెండు రోజుల క్రితం భారతీయ చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు, పుంగనూరు అభ్యర్థి రామచంద్రయాదవ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దిరెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెకు వెళ్లడంతో వైసీపీ మూకలు అడ్డుకుని రాళ్లు, కర్రలతో దాడులు చేశారు. 15 వాహనాలను ధ్వంసం చేసి, 20 మందిని గాయపరిచారు. భద్రత కోసం ఆయన సదుం పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లగా వందలాది మంది లోనికి చొరబడి హతమార్చడానికి ప్రయత్నించారు. స్టేషన్‌ ముందు నిలిపి ఉంచిన ప్రచార రథాన్ని పోలీసులు చూస్తుండగానే ధ్వంసం చేసి, నిప్పుపెట్టి బీభత్సం సృష్టించారు. కానీ బాధితుడైన రామచంద్రయాదవ్‌పైనే పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టి ఎన్నికలయ్యే వరకు జైలుకు పంపింది. ప్రచారానికి బ్రేక్‌ చేయడం కోసమే వైసీపీ ఈ మేరకు కుయుక్తులు పన్నిందన్న విమర్శలున్నాయి.

చంద్రబాబుకూ తప్పని అవమానం

1990లో సదుంలో ఓ మహిళను హత్య చేసి, పోలీ్‌సక్వార్టర్స్‌ నుంచి బయటకు తీసుకెళ్లి మూటగట్టి పడేశారన్న సమాచారంతో ప్రజలు పెద్దయెత్తున పోలీ్‌సస్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో జరిపిన పోలీసు కాల్పుల్లో జాండ్రపేట, చింతలవారిపల్లెకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మృతి చెందారు. సదుంలో మృతుల కుటుంబీకులను పరామర్శించడానికి కర్షక పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో నారా చంద్రబాబు నాయుడు రాగా పెద్దిరెడ్డి అనుచరులు మిద్దెలపై నుంచి పేడ నీళ్లను చంద్రబాబు ఉన్న ప్రాంతాల్లో చల్లారు. సదుంలో ఎక్కడా చంద్రబాబు కూర్చోరాదని హుకుం జారీ చేసి, అవమానం చేయడంతో ఆయన టీడీపీ శ్రేణులతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

చిరంజీవి అభిమాని ఎలక్ర్టికల్‌ షాపు దగ్ధం

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పట్ల ఉన్న అభిమానంతో సదుంకు చెందిన ప్రసాద్‌ పార్టీలో ఉత్సాహంగా పనిచేసేవారు. దీన్ని జీర్ణించుకోలేని పెద్దిరెడ్డి అనుచరులు ‘చిరంజీవి పార్టీలో ఉంటావా’ అంటూ ప్రసాద్‌కు చెందిన ఎలక్ర్టికల్‌ షాపుపై పెట్రోల్‌ పోసి, నిప్పుపెట్టారు. ఆయనపై దాడి చేసి భయబ్రాంతులకు గురిచేశారు.

జీవీ శ్రీనాథరెడ్డిపై పలుమార్లు దౌర్జన్యాలు

పీలేరు మాజీ ఎమ్మెల్యే జీవీ.శ్రీనాథరెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రతి సందర్భంలోనూ సదుం మండలం బూరగమంద, నడిగడ్డ, సదుం జడ్పీ హైస్కూల్‌ వద్ద పెద్దిరెడ్డి అనుచరులు దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. సదుం వార్డు మెంబరుగా ఎన్నికైన టీడీపీ నేత రఘునాథరెడ్డిపై పెద్దిరెడ్డి వర్గీయులు దాడి చేయడంతో ఆయనను పరామర్శించడానికి వెళ్లిన శ్రీనాథరెడ్డిపై సదుం వినాయక స్కూల్‌ వద్ద ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ విషయంపై ఆయన టీడీపీ జిల్లా నేతలతో కలిసి చిత్తూరులో ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

2014లో టీడీపీ అభ్యర్ధి కుమారుడిపై దాడి

2014 ఎన్నికల్లో పుంగనూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.వెంకట్రమణరాజు కుమారుడు ఎం.సుదీప్‌, మరికొందరు ప్రచారానికి సదుం వెళ్లారు. జీర్ణించుకోలేని పెద్దిరెడ్డి అనుచరులు పెట్రోల్‌ బంకు వద్ద సుదీప్‌, మరికొందరిపై దాడి చేయడంతో పొలాల నుంచి తప్పించుకుని వెళ్లారు. టీడీపీ శ్రేణులు సదుం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా, సదుంలో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహంగా ఉన్నారని నడిగడ్డకు చెందిన పవన్‌కుమార్‌రెడ్డి (మాజీ సైనికుడు)ని పలుమార్లు బెదిరించి, కొట్టారు.

బీజేపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ చించివేత

సదుం ఎంపీటీసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆ పార్టీ నాయకుడు కలికిరి హరిబాబు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు. ‘మాకు వ్యతిరేకంగా నామినేషన్‌ వేయడానికి నీకు ఎంత ధైర్యం’ అంటూ 2020 మార్చి 9వ తేదీ నామినేషన్‌ పత్రాలు బలవంతంగా లాక్కెళ్లి చించేశారు. దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ విషయంపై అప్పటి చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ సదుం వచ్చి విచారించారు.

రామచంద్రయాదవ్‌పై దాడి

బీసీవైపీ అభ్యర్థి బోడే రామచంద్రయాదవ్‌ మంత్రి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెకు ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో ‘మా పెద్దాయన ఊరికే వస్తారా’ అంటూ బీభత్సం సృష్టించారు. ప్రచార రథంపై రాళ్లు వేశారు. వాహనాలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. కల్లూరు రోడ్డు, సదుం పోలీ్‌సస్టేషన్‌ వద్ద ఆయనను హతమార్చాలని వైసీపీ అల్లరి మూకలు ప్రయత్నించాయి. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ మణికంఠ వచ్చి పరిశీలించారు. చివరకు పోలీసులు ఫిర్యాదుదారులుగా బాధితులైన బీసీవైపీ వారిపైనే హత్యాయత్నం కేసులు పెట్టారు.

బీసీవై పార్టీ నేత ఆనందరెడ్డి ఇంటికి నిప్పు

సదుం మండలం చిలకపాటివారిపల్లెకు చెందిన బీసీవై పార్టీ నాయకుడు ఆనందరెడ్డి రామచంద్రయాదవ్‌కు భోజనం పెట్టారని ఆయన ఇంటికి వైసీపీ మూకలు నిప్పు పెట్టాయి. ఆనందరెడ్డి భార్య, పిల్లలు ఇంట్లో ఉండగా ఇంటికి తాళాలు వేసి పెట్రోల్‌ పోసి కాల్చివేశారు. యాక్టివా స్కూటర్‌ను పూర్తిగా దహనం చేశారు. కారును ధ్వంసం చేసి, ఇంటిపైకి రాళ్లు, కర్రలు రువ్వి బీభత్సం సృష్టించారు.

Updated Date - May 02 , 2024 | 02:59 AM