Share News

చంద్రగిరిలో నేడు హలో లోకేశ్‌

ABN , Publish Date - May 02 , 2024 | 03:10 AM

చంద్రగిరి మండలం అగరాల సమీపంలోని జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలంలో గురువారం హలో లోకేశ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు.

చంద్రగిరిలో నేడు హలో లోకేశ్‌
అగరాల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని

చంద్రగిరి, మే 1: చంద్రగిరి మండలం అగరాల సమీపంలోని జాతీయ రహదారి ఆనుకుని ఉన్న ప్రైవేటు స్థలంలో గురువారం హలో లోకేశ్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విచ్చేయనున్నారు. ఈసందర్భంగా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సభా స్థలాన్ని బుధవారం టీడీపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కార్యక్రమానికి సుమారు పది వేల మంది యువత హాజరుకానున్నట్లు తెలిపారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దంపై, ఉద్యోగాల కల్పనకు కృషిపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిపారు. యువతీయువకులు భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని నానీ పిలుపునిచ్చారు.

Updated Date - May 02 , 2024 | 03:10 AM