Share News

నిప్పుల కుంపటి

ABN , Publish Date - May 02 , 2024 | 03:04 AM

జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం 7గంటలకే భానుడు సెగలు పుట్టిస్తుండడంతో బయటకు రావాలంటే జనం బెంబేలెత్తుతున్నారు.

నిప్పుల కుంపటి
ఎండ దెబ్బకు నిర్మానుష్యంగా కన్పిస్తున్న తిరుచానూరు బైపాస్‌ రోడ్డు

ఎండల దెబ్బకు మాడిపోతున్న జనం

సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తిల్లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత

20 మండలాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

అత్యల్పం 36.8 డిగ్రీలు

తిరుపతి(కలెక్టరేట్‌), మే 1: జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉదయం 7గంటలకే భానుడు సెగలు పుట్టిస్తుండడంతో బయటకు రావాలంటే జనం బెంబేలెత్తుతున్నారు.నాలుగు రోజులుగా కనిష్ణ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటడం గమనార్హం.రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.రానున్న మూడురోజులు వడగాడ్పులు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.బుధవారం గరిష్టంగా శ్రీకాళహస్తి, సూళ్ళూరుపేటల్లో 45.9డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా 20 మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.నాయుడుపేట మండలంలో 45.8డిగ్రీలు, డక్కిలి, తొట్టంబేడుల్లో 44.8, ఏర్పేడులో 44.6, వెంకటగిరి,కేవీబీపురం,డీవీసత్రం మండలాల్లో 44.3,తిరుపతి రూరల్‌, నాగలాపురం మండలాల్లో 44, ఎర్రావారిపాళెం, చిట్టమూరుల్లో 43.7,రేణిగుంటలో 43.3, ఆర్‌సీపురం మండలంలో 43.1డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోట, వాకాడు, బాలాయపల్లె మినహా మిగిలిన మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం.గురువారం కూడా ఇదే విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

Updated Date - May 02 , 2024 | 03:04 AM