Share News

tdp: ముస్లింలను పట్టించుకోని వైసీపీ : బీకే

ABN , Publish Date - May 02 , 2024 | 12:28 AM

ధర్మవరం, మే 1: వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలను పట్టించుకోలేదని హిందూపురం పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి బీకే పార్థసారధి పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందుకు కేంద్ర మాజీ మంత్రి స య్యద్‌షానవాజ్‌ హుస్సేన, బీకేపార్థసారధి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిసత్యకుమార్‌యాదవ్‌, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్‌, జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు.

tdp: ముస్లింలను పట్టించుకోని వైసీపీ : బీకే
సమావేశంలో మాట్లాడుతున్న బీకే పార్థసారధి

ధర్మవరం, మే 1: వైసీపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం మైనారిటీలను పట్టించుకోలేదని హిందూపురం పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి బీకే పార్థసారధి పేర్కొన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందుకు కేంద్ర మాజీ మంత్రి స య్యద్‌షానవాజ్‌ హుస్సేన, బీకేపార్థసారధి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిసత్యకుమార్‌యాదవ్‌, టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్‌, జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా బీకే మాట్లాడుతూ... రాష్ట్రంలో మైనార్టీలకు అండ గా నిలబడింది ఒక్క తెలుగుదేశం పార్టీనేనన్నారు. మైనార్టీలకు రంజానతోఫా, దుల్హానతో పాటు 13 పథకాలను చంద్రబాబు అందించారని గుర్తు చేశా రు. ఇమాంలు, మౌజమ్‌లకు గౌరవవేతనం అందించారన్నారు. వైసీపీ వచ్చాక ఆ పథకాలన్నింటినీ రద్దు చేశారని తెలిపారు. అంతేకాకుండా సీఎం జగన ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ధర్మవరంలో కేతిరెడ్డి ఆగడాలకు అంతు లేకుండా పోయిందన్నారు. దౌర్జన్యాలు,భూ కబ్జాలు, దాడులు అధికమయ్యాయన్నారు. వీటికి చెక్‌పెట్టడానికి సత్యకుమార్‌ను కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:28 AM