Share News

pention పింఛన.. టెన్షన..

ABN , Publish Date - May 02 , 2024 | 12:36 AM

ధర్మవరంరూరల్‌, మే1: మండలవ్యాప్తంగా పింఛనదారులకు కష్టాలు తప్పలేదు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గతనెల ఏప్రిల్‌లో సచివాలయ సిబ్బందిచే పింఛన్లు పంపిణీ చేశారు. మే నెల మాత్రం బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పింఛనదారుల్లో ఆందోళన నెలకొంది. బ్యాంకు ఖాతాల్లో పింఛనడబ్బులు జమచేస్తే తీవ్రమైన ఎండలకు ఎలా అబ్బా పోయేది అంటూ పింఛనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో జమచేస్తే ఎలా తెచ్చుకునేది అంటూ వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. గతనెల మాదిరిగా ఈ నెల కూడా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేసింటే బాగుండేది అంటూ పలువురు పేర్కొంటున్నారు.

pention పింఛన.. టెన్షన..

- ఆందోళన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు

ధర్మవరంరూరల్‌, మే1: మండలవ్యాప్తంగా పింఛనదారులకు కష్టాలు తప్పలేదు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గతనెల ఏప్రిల్‌లో సచివాలయ సిబ్బందిచే పింఛన్లు పంపిణీ చేశారు. మే నెల మాత్రం బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పింఛనదారుల్లో ఆందోళన నెలకొంది. బ్యాంకు ఖాతాల్లో పింఛనడబ్బులు జమచేస్తే తీవ్రమైన ఎండలకు ఎలా అబ్బా పోయేది అంటూ పింఛనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులో జమచేస్తే ఎలా తెచ్చుకునేది అంటూ వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. గతనెల మాదిరిగా ఈ నెల కూడా సచివాలయ సిబ్బందితో పంపిణీ చేసింటే బాగుండేది అంటూ పలువురు పేర్కొంటున్నారు.

బుధవారం నడిమిగడ్డపల్లి తండాలో పింఛనదారులకు పింఛన పంపీణీ చేస్తారని అంతా ఒకచోటికి చేరుకున్నారు. అయితే వారికి సచివాలయ సిబ్బంది మీ అందరికి బ్యాంకులో పింఛనడబ్బులు జమచేస్తారు అని తెలపడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. సచివాలయ సిబ్బందితో గత నెల మాదిరిగా పంపిణీ చేసింటే బాగుండు అని ఒకరినొకరు చర్చించుకున్నారు. తమ ఊరిలో బ్యాంకు లేదని పక్కఊరు దర్శినమల గ్రామంలో ఉందని, అక్కడికి వెళ్లాలంటే 2కిలోమీటర్లు దూరం వెళ్లాలని దీంతో ఇబ్బందులు తప్పవని పింఛనదారులు మండిపడ్డారు. ఇళ్లవద్దనే ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 02 , 2024 | 12:36 AM