Share News

AP News: అట్లుందని..జగన పాలన..!

ABN , Publish Date - May 02 , 2024 | 12:38 AM

రైతులకు వ్యయసాయంతోపాటు పాడి అదనపు ఆదాయ వనరు. చాలామంది రైతులు అనంతపురం డెయిరీకి పాలు పోసి ప్రతివారం బిల్లులు పొందేవారు. తద్వారా పిల్లల చదవులు, ఇంటి అవసరాలను పాల డబ్బులతో తీర్చుకునేవారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాలవెల్లువ పొంగిపొర్లిందని పాడిరైతులు గుర్తుచేసుకుంటున్నారు.

AP News: అట్లుందని..జగన పాలన..!
Ananatapur dairy

టీడీపీ ప్రభుత్వంలో పాలవెల్లువ

రోజుకు లక్షల లీటర్ల పాలను

సేకరించిన అనంతపురం డెయిరీ

ఆర్థిక సాధికారతను సాధించిన పాడి రైతులు

జగన రాగానే డెయిరీ మూత

‘పాడి’రైతుల పొట్టకొట్టిన ప్రభుత్వం

అనంతపురం సెంట్రల్‌, మే 1: రైతులకు వ్యయసాయంతోపాటు పాడి అదనపు ఆదాయ వనరు. చాలామంది రైతులు అనంతపురం డెయిరీకి పాలు పోసి ప్రతివారం బిల్లులు పొందేవారు. తద్వారా పిల్లల చదవులు, ఇంటి అవసరాలను పాల డబ్బులతో తీర్చుకునేవారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పాలవెల్లువ పొంగిపొర్లిందని పాడిరైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఒక్క చాన్స ఇవ్వండని బతిమాలిన జగనకు ఓటేసి గెలిపిస్తే.. ఏకంగా డెయిరీనే మూతవేయించారని రైతులు మండిపడుతున్నారు. పాడిరైతుల కష్టాన్ని కార్పొరేట్‌కు అమ్ముకుని కోట్లు కొల్లగొట్టేందుకు అమూల్‌ సంస్థను తీసుకువచ్చిన జగన.. తమ కడుపులు కొట్టారని వాపోతున్నారు. మరోసారి జగన అధికారంలోకి వస్తే డెయిరీ ఆస్తులను అమ్ముకుని జేబు నింపుకోవడం ఖాయమని పాడిరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

32 బీఎంసీయూల ఏర్పాటు...

ఉమ్మడి జిల్లాలో 63 మండలాల వ్యాప్తంగా 32 బీఎంసీయూ (బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌)లను ఏర్పాటు చేశారు. యూనిట్ల పరిధిలోని గ్రామాల్లో పాడిరైతుల ద్వారా సేకరించిన పాలను ఎప్పటికప్పుడు బీఎంసీయూలకు తరలించి కూలింగ్‌ చేసేవారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా డెయిరీ ప్లాంట్‌కు రవాణాచేసేవారు. ప్రాసె్‌సను పూర్తిచేసిన అనంతరం పాల ప్యాకెట్లను తయారుచేసి మార్కెట్‌కు తరలించేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డెయిరీతోపాటు బీఎంసీయూలు మూతపడ్డాయి. దీంతో ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తమ కష్టార్జితంతో పోగుచేసిన రూ.కోట్ల విలువచేసే బీఎంసీయూ, డెయిరీ ప్లాంట్‌ యంత్రాలు, పరికరాలు తుప్పుపట్టాయని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన తన సామాజిక వర్గానికి చెందిన కొందరి వ్యక్తులకు పాల వ్యాపారంలో అడ్డుకాకూడదనే దురుద్దేశంతోనే డెయిరీని మూతయించారని రైతులు మండిపడుతున్నారు

మరోసారి జగన అధికారంలోకి వస్తే డెయిరీ ఆస్తులను అమ్ముకుని జేబు నింపుకోవడం ఖాయమని పాడిరైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

32 బీఎంసీయూల ఏర్పాటు...

ఉమ్మడి జిల్లాలో 63 మండలాల వ్యాప్తంగా 32 బీఎంసీయూ (బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌)లను ఏర్పాటు చేశారు. యూనిట్ల పరిధిలోని గ్రామాల్లో పాడిరైతుల ద్వారా సేకరించిన పాలను ఎప్పటికప్పుడు బీఎంసీయూలకు తరలించి కూలింగ్‌ చేసేవారు. అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా డెయిరీ ప్లాంట్‌కు రవాణాచేసేవారు. ప్రాసె్‌సను పూర్తిచేసిన అనంతరం పాల ప్యాకెట్లను తయారుచేసి మార్కెట్‌కు తరలించేవారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డెయిరీతోపాటు బీఎంసీయూలు మూతపడ్డాయి. దీంతో ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తమ కష్టార్జితంతో పోగుచేసిన రూ.కోట్ల విలువచేసే బీఎంసీయూ, డెయిరీ ప్లాంట్‌ యంత్రాలు, పరికరాలు తుప్పుపట్టాయని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన తన సామాజిక వర్గానికి చెందిన కొందరి వ్యక్తులకు పాల వ్యాపారంలో అడ్డుకాకూడదనే దురుద్దేశంతోనే డెయిరీని మూతయించారని రైతులు మండిపడుతున్నారు

మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 02 , 2024 | 12:38 AM