Share News

AP Elections: అంతా సర్వేలమయం

ABN , Publish Date - May 02 , 2024 | 12:41 AM

సార్వత్రిక ఎన్నికల్లో విజయతీరాలు చేరేందుకు సర్వేలు కీలకమయ్యాయి. వివిధ సంస్థలతోపాటు అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న సొంత సర్వే ఏజెన్సీలు నియోజకవర్గాల వారిగా ఓటర్ల మనస్తత్వం తెలుసుకునేందుకు జల్లెడు పడుతున్నాయి. సర్వేల ఆధారంగా ఆయా మండలాల్లో అనుకూలత, ప్రతికూలతపై సర్వే సంస్థల ప్రతినిధులు అభ్యర్థులకు నివేదిక ఇస్తున్నారు.

AP Elections: అంతా సర్వేలమయం

గోప్యంగా సమాచార సేకరణ...

అభ్యర్థులకు నివేదికలు ఇస్తున్న సర్వే బృందాలు

హిందూపురం, మే1 : సార్వత్రిక ఎన్నికల్లో విజయతీరాలు చేరేందుకు సర్వేలు కీలకమయ్యాయి. వివిధ సంస్థలతోపాటు అభ్యర్థులు ఏర్పాటు చేసుకున్న సొంత సర్వే ఏజెన్సీలు నియోజకవర్గాల వారిగా ఓటర్ల మనస్తత్వం తెలుసుకునేందుకు జల్లెడు పడుతున్నాయి. సర్వేల ఆధారంగా ఆయా మండలాల్లో అనుకూలత, ప్రతికూలతపై సర్వే సంస్థల ప్రతినిధులు అభ్యర్థులకు నివేదిక ఇస్తున్నారు. ఈ నివేదికల ద్వారా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే చక్కబెట్టుకునే అవకాశం చిక్కుతుంది. ఈ సర్వే వ్యవహారమంతా గోప్యంగా సాగుతోంది. ఎక్కడ పది మంది గుమిగూడి ఉంటారో వారి వద్ద చర్చలు జరుపుతారు. వారి నుంచి సమాచారం రాబట్టి ఆ మేరకు నివేదికను రూపొందిస్తారు. వృద్ధులు, యువకులు, మహిళలు కొత్తగా ఓటర్లయిన యువత, నిరుద్యోగుల నుంచి అనుకూల, ప్రతికూల అంశాలపై ఆరాతీస్తున్నారు. సర్వేల ద్వారా ప్రత్యర్థుల వ్యూహాలు కూడా తెలుస్తుంటాయి.


రాజకీయాలకు సంబంధంలేని సమీప బంధుమిత్రులతో కూడా కొత్త విషయాలు తెలుసుకుని అభ్యర్థులకు వినిపిస్తున్నారు. సర్వేల ద్వారా అభ్యర్థులు తమ విజయానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఆయా పార్టీలు ఈసారి ఎక్కువ భాగం సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ప్రకటించాయి. అధికార పార్టీ తాము చేసిన పనులు, ప్రస్తుత పరిస్థితులు, అనుకూల, ప్రతికూలతలను ఆరాతీస్తున్నట్లు సమాచారం. ప్రతికూల అంశాల వివరాలను సేకరించేందుకు సర్వేలో ముమ్మరం చేశాయి.

సర్వ బృందాలు ఓటర్లనాడి తెలుసుకోవడమేకాక ప్రస్తుత ఎన్నికల్లో పార్టీల బలాలు, బలహీనతలను గుర్తిస్తున్నాయి. సర్వే బృందం పనిచేసే పార్టీ ఎక్కడైనా బలహీనంగా ఉంటే అక్కడ ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవరైనా నాయకులు వస్తారా..? వస్తే ఎంతమేర మేలు చేకూరుతుంది.. వారికి ఆర్థిక వనరులు, భవిష్యత్తులో పార్టీ నుంచి వారికి ఏవిధంగా ఉపయోగం ఉంటుందో సర్వేబృందాలు వివరిస్తూ మధ్యవర్తులుగా కూడా వ్యవహరిస్తున్నాయి. అధికార పార్టీకి సర్వే చేస్తున్న బృందాల ప్రతినిధులు వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టారు. మరీ ముఖ్యంగా పార్టీలో అలిగినవారి వివరాలు ఆరాతీసి వారు ఎందుకు మౌనంగా ఉన్నారో సన్నిహితుల ద్వారా తెలుసుకుని ఎప్పటికప్పుడు అభ్యర్థులకు చేరవేస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 02 , 2024 | 12:41 AM