Share News

AP Elections: భారత ఎన్నికల సంఘానికి 74 సంవత్సరాలు

ABN , Publish Date - May 02 , 2024 | 12:43 AM

భారత ఎన్నికల సంఘం ఏర్పడి 74 సంవత్సరాలు గడుస్తోంది. భారత ఎన్నికల సంఘం ఓ స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నిలకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకుంటుంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. దేశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏక కాలంలో దేశ వ్యాప్తంగా దాదాపు 50లక్షల మంది ఉద్యోగుల సేవలను ఎన్నికల సంఘం వినియోగించుకుంటుంది.

AP Elections: భారత ఎన్నికల సంఘానికి 74 సంవత్సరాలు

కదిరి అర్బన: భారత ఎన్నికల సంఘం ఏర్పడి 74 సంవత్సరాలు గడుస్తోంది. భారత ఎన్నికల సంఘం ఓ స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నిలకు సంబంధించిన ప్రతి నిర్ణయాన్ని స్వేచ్ఛగా తీసుకుంటుంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. దేశ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏక కాలంలో దేశ వ్యాప్తంగా దాదాపు 50లక్షల మంది ఉద్యోగుల సేవలను ఎన్నికల సంఘం వినియోగించుకుంటుంది. ఎన్నికల సంఘం ఏర్పాటు అయ్యాక మొదటి సాధారణ ఎన్నికలను హిమాచల్‌ ప్రదేశలోని చిని నియోజకవర్గంలో నిర్వహిం చారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల సంఘం కమిషనర్లుగా రాష్ట్రపతి నియమిస్తారు. ఎన్నికల సంఘానికి పలు అనుబంధ విభాగాలుంటాయి. మొదటి భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా సుకుమార్‌సేన నియమితుల య్యారు. అయితే ప్రతి రాష్ట్రానికి కూడా ఒక ఎన్నికల సంఘం ఉంటుంది. ఆసంఘాలన్ని భారత ఎన్నికల సంఘం పరిధిలో విధులు నిర్వహిస్తుంటారు. రెండింటి మధ్య పని విభజన, సమన్వయం, తదితరాంశాలపై పారదర్శకత ఉంటుంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - May 02 , 2024 | 12:43 AM