Share News

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత బెయిల్‌పై నేడు తీర్పు

ABN , Publish Date - May 06 , 2024 | 07:18 AM

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై సోమవారం తీర్పు వెలువడనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ ఈడి, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు.

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. కవిత బెయిల్‌పై నేడు తీర్పు

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kavitha) బెయిల్‌ (Bail) పిటిషన్లపై సోమవారం తీర్పు వెలువడనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా (Kaveri Baweja) తీర్పు ఇవ్వనున్నారు. లిక్కర్ ఈడి (ED), సీబీఐ (CBI) కేసుల్లో కవిత బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. ఈడి, సీబీఐ రెండు కేసుల్లోనూ వాదనలు ముగిసాయి. దీంతో ఇవాళ కవిత బెయిల్‌పై రౌస్ ఎవిన్యూ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనున్నారు. లిక్కర్ కేసులో మార్చి 15 న కవితను ఈడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే తిహాడ్ జైల్లో ఉన్న ఆమెను ఏప్రిల్ 11 న సీబీఐ అరెస్ట్ చేసింది.


కాగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడి, సీబీఐ కేసులో కవిత బెయిల్‌ కోసం గత నెల 22న రౌస్‌ అవెన్యూ కోర్టులో వాదనలు జరుగ్గా న్యాయమూర్తి కావేరీ బవేజా తొలుత మే 2కు తీర్వు రిజర్వు చేశారు. అయితే మే 2న తీర్పు వస్తుందని అంతా భావించగా.. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు మే 6కు రిజర్వ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో బెయిల్‌ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఒకవేళ కవితకు బెయిల్‌ లభిస్తే జ్యుడీషయల్‌ రిమాండ్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. బెయిల్‌ను న్యాయస్థానం నిరాకరిస్తే మాత్రం.. కవితను కోర్టులో హాజరుపరుస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 06 , 2024 | 07:19 AM