Share News

BJP: వరి కొనుగోలులో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం: పాల్వాయ్ హరీష్ బాబు

ABN , Publish Date - May 17 , 2024 | 03:44 PM

Telangana: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నా ఫలితాలు రావడం లేదన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో కావాలని కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలతో కల్లాల్లో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

BJP: వరి కొనుగోలులో సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం: పాల్వాయ్ హరీష్ బాబు
BJP MLA Palvai Harish Babu

హైదరాబాద్, మే 17: వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు (BJP MLA Palvai Harish Babu) విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నా ఫలితాలు రావడం లేదన్నారు. గన్నీ బ్యాగుల విషయంలో కావాలని కొరత సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వర్షాలతో కల్లాల్లో ధాన్యం కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం టార్పాలీన్ కూడా ఇవ్వలేదని అన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు (Farmers) ఎకరాకు 30 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ భీమా యోజన కింద విధివిధానాలు తయారు చేసి వానాకాలం పంటకైనా సాయం చేయాలని ఎమ్మెల్యే తెలిపారు.

AP Elections 2024: ఏపీలో పలువురు అధికారుల బదిలీలు.. కారణమిదే..?


సీఎం రేవంత్ (CM Revanth Reddy), మంత్రులకు పాలనపై పట్టు దొరకలేదని వ్యాఖ్యలు చేశారు. మార్కెట్‌లో సీసీ టీవీలు పెడతామన్నారని.. ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు. తేమ, తాలు పేరుతో తూకాల్లో తేడాతో రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్‌కు వ్యవసాయశాఖ మంత్రి పోలేదంటే వీరి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పీని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి....

PM Modi: ఈడీ సీజ్‌ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు

నిధులేమవుతున్నయ్‌ ?

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2024 | 03:57 PM