Share News

Viral Video: అదేంటి? ఇలా కూడా బట్టలను ఇస్త్రీ చేస్తారా? వైరల్ వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు!

ABN , Publish Date - May 05 , 2024 | 05:39 PM

బట్టలను ఇస్త్రీ చేసేందుకు రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. గతంలో కాలుతున్న బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో ఉంచి, దానితో ఇస్త్రీ చేసేవారు. ప్రస్తుతం కరెంట్ ఐరన్ బాక్స్‌లతో ఇస్త్రీ చేస్తున్నారు. అయితే ఎలా చేసినా ఇస్త్రీ పెట్టె వేడిగా ఉండాలన్నది బేసిక్ రూల్.

Viral Video: అదేంటి? ఇలా కూడా బట్టలను ఇస్త్రీ చేస్తారా? వైరల్ వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు!
Ironing Clothes

బట్టలను ఇస్త్రీ (Ironing) చేసేందుకు రకరకాల పద్ధతులను ఉపయోగిస్తారు. గతంలో కాలుతున్న బొగ్గులను ఇస్త్రీ పెట్టెలో ఉంచి, దానితో ఇస్త్రీ చేసేవారు. ప్రస్తుతం కరెంట్ ఐరన్ బాక్స్‌లతో (Iron Box) ఇస్త్రీ చేస్తున్నారు. అయితే ఎలా చేసినా ఇస్త్రీ పెట్టె వేడిగా ఉండాలన్నది బేసిక్ రూల్. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి చేస్తున్న ఇస్త్రీ చూస్తే షాకవ్వాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇదెలా సాధ్యం అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).


seldahomee1 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి చదునుగా ఉన్న ఓ ఇనుము ముక్కకు పెద్ద చెక్క కర్రలాంటి దాన్ని అమర్చాడు. టేబుల్‌పై షర్టు ఉంచి ఆ ఇనుమును ఉపయోగించి తన పాదం, చేతులతో ఇస్త్రీ చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తి జగ్గులోని నీటిని నోట్లో వేసుకుని ఆ నీటిని ఆ షర్టుపై చిలకరిస్తూ ఇస్త్రీ చేస్తున్నాడు. ఈ వెరైటీ ఇస్త్రీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా వీక్షించారు. 45 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బ్రదర్.. మీలో చాలా ప్రతిభ దాగి ఉంది``, ``ఈ టెక్నిక్‌ను ఇండియా దాటి బయటకు వెళ్లనివ్వకూడదు``, ``ఇలాంటి ఇస్త్రీని ఎక్కడా చూడలేదు``, ``ఇది వీడియో కోసం చేసినట్టున్నారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. అరగంట పాటు నిలిచిపోయిన రైలు.. తర్వాత ఏమైందంటే..


Viral Video: ఈ కోతిని చూసి టేబుల్ మేనర్స్ నేర్చుకోవాలి.. కుర్చీలో కూర్చుని ఎలా తింటోందో చూడండి.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2024 | 05:39 PM