Share News

Viral: ఆటోవాలాకు జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన మహిళ!

ABN , Publish Date - May 05 , 2024 | 05:32 PM

నిబద్ధతతో తన పనిచేసుకుపోయే ఆటోవాలాకు ఓ మహిళా కస్టమర్‌ అద్భుత బహుమతి ఇచ్చింది. అతడి వద్ద పాత ప్లాస్టిక్ బాటిల్‌ను చూసి దానికి బదులుగా ఓ కొత్త స్టీల్ ఇన్సులేటెడ్ బాటిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది.

Viral: ఆటోవాలాకు జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చిన మహిళ!

ఇంటర్నెట్ డెస్క్: కష్టపడే వారికి తమ కష్టానికి తగ్గ గుర్తింపు దక్కితే అంతకు మించిన ఆనందం ఉండదు. అందుకే, ఓ ఆటోవాలా నిబద్ధతకు మెచ్చిన మహిళ అతడికి ఈ ఎండాకాలానికి తగిన గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ చూసి అతడి ముఖం సంబరంతో వెలిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

తనను క్రమం తప్పకుండా స్కూలు నుంచి ఇంటికి తీసుకొచ్చే ఆటోవాలా నిబద్ధతకు ఓ మహిళ ముచ్చపడింది. అతడు శ్రమజీవి. కష్టపడేందుకు వెరవని అతడు తనకు వచ్చిన డబ్బులోనే జీవనం సాగిస్తున్నాడు. ఎంతోకాలంగా మహిళ అతడిని పరిశీలిస్తోంది. అతడు మంచి నీళ్లు తాగేందుకు తన వెంట ఓ ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళతాడు. అది పాత బాటిల్ కావడంతో బాగా సొట్టలు పడి, కాస్తంత మురికిగా కూడా ఉంటుంది.

Sweat Rice balls: అందమైన యువతుల చంకలోని చెమటతో ఘుమఘుమలాడే డిష్.. తెగ తింటున్న జనాలు!


అయితే, ఆటోవాలా నిబద్ధత మహిళకు నచ్చడంతో అతడికి ఏదైనా బహుమతి ఇవ్వాలని అనుకుంది. ఈ క్రమంలో ఆమె దృష్టి అతడి వాటర్ బాటిల్‌పై పడింది. దానికి బదులు కొత్తది కొనివ్వాలనుకున్న మహిళ ఏకంగా స్టెయిన్‌లెస్ స్టీల్ ఇన్సులేటెడ్ బాటిల్ కొనింది. ఇటీవల ఓ రోజు తను స్కూల్ నుంచి ఇంటికొచ్చాక అతడిని అక్కడే ఉండమని చెప్పి ఆమె తన ఇంట్లోంచి గిఫ్ట్ ర్యాప్ చేసిన బాటిల్‌ను తీసుకొచ్చి అతడి చేతుల్లో పెట్టింది. రంగురంగుల కాగితంతో చుట్టిన ఉన్న డబ్బాలో ఏముందో ఆటోవాలాకు మొదట అర్థంకాలేదు. పేపర్ తొలగించి డబ్బా తెరిచి చూస్తే అందులో తళతళా మెరిసిపోతున్న బాటిల్ చూసి ఆశ్చర్యపోయాడు. అతడి మొఖం ఆనందంతో వెలిగిపోయింది (Auto drivers priceless reaction after getting a surprise gift from woman customer).

Viral: పాపం.. ఈ కుక్కకు చావు ముంచుకొస్తున్న విషయమే తెలీలా! షాకింగ్ వీడియో


వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు మహిళ ఔదార్యానికి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న సాయాలే మనసుల్లో ఆనందాన్ని నింపుతాయని, సమాజంలో సంతోషం వెల్లివిరిసేలా చేస్తాయని కొందరు కామెంట్ చేశారు. ఆటోవాలాకు జీవితంలో మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఇలా రకరకాల కామెంట్ల మధ్య వీడియో వైరల్ అవుతోంది.

Read Viral and Telugu News

Updated Date - May 05 , 2024 | 05:46 PM