Share News

Raw Milk: వామ్మో.. పచ్చి పాలు తాగితే ఇంత ప్రమాదమా?

ABN , Publish Date - May 18 , 2024 | 06:16 PM

ప్యాశ్చరైజేషన్ చేయని పచ్చిపాలల్లో అనేక రకాల హానికారక బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు.

Raw Milk: వామ్మో..  పచ్చి పాలు తాగితే ఇంత ప్రమాదమా?

ఇంటర్నెట్ డెస్క్: మనం సాధారణంగా ప్యాకెట్లలో చూసే పాలను ప్యాశ్చరైజ్డ్ మిల్క్ (Pasteurized Milk) అని అంటారు. అంటే..పాలను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కొంతసేపు వేడి చేసి చల్లార్చాక ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు. అయితే, ప్యాశ్చరైజ్డ్ పాలకంటే పచ్చి పాలు ఆరోగ్యానికి (Health) మేలు చేస్తాయని కొందరు నమ్ముతారు. పచ్చిపాలల్లో (Raw Milk) విటమిన్లు, ఇతర పోషకాలు అధికమోతాదుల్లో ఉంటాయని అంటారు. ఇది నిజమని రుజువు చేసే ఆధారాలు ఏవీ లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చిపాలు తాగితే ఆరోగ్యానికి బదులు అపాయం ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు (Raw Milk unsafe to Drink).

Hair-Care: ఎండాకాలంలో జుట్టు ఎక్కువగా ఊడిపోతోందా? ఇలా చేస్తే సరి..


పచ్చి పాలతో డేంజర్స్..

ప్యాశ్చరైజేషన్ చేయని పాలను పచ్చిపాలని అంటారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఇందులో రకరకాల హానికారక బ్యాక్టీరియాలు ఉంటాయి. అంతేకాకుండా, ప్యాశ్చరైజ్ చేయకపోవడంతో ఇవి త్వరగా పాడవుతాయి.

పచ్చిపాలతో ప్రధాన సమస్య బోవైన్ ట్యూబరికలోసిస్ అని వైద్యులు చెబుతున్నారు. 1900ల్లో పాశ్చరైజేషన్ ప్రక్రియను కనిపెట్టకమునుపు 25 ఏళ్ల వ్యవధిలో ఏకంగా 65 వేల మంది బోవైన్ ట్యూబరికలోసిస్ బారినపడి కన్నుమూశారు. ఇది పచ్చిపాల ద్వారా సులువుగా మనుషులకు వ్యాపిస్తుంది.

ఇక ప్యాశ్చరైజ్డ్ పాలల్లో అంతా అనుకున్నట్టు పోషకాలు తక్కువగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మనుషుల ఆరోగ్యానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు.

పచ్చిపాలతో బోవైన్ ట్యూబరికలోసిస్ తో పాటు అనేక రకాల ఇతర హానికారక బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ పాలల్లో ఉండే సాల్మొనెల్లా, ఎశ్చరీచియా, కాంపైలో బ్యాక్టర్, ఈ. కొలై, క్రిప్టోస్పరీడియమ్ వంటి బ్యాక్టీరియాలతో ఆర్థరైటిస్, గిలియన్ బార్ సిండ్రోమ్, హీమోలైటిక్ యూరెమిక్ సిండ్రోమ్ వంటి వ్యాధులు వస్తాయి. డయేరియా, డీహైడ్రేషన్, వాంతులు, జ్వరం వంటి వాటితో బాధపడాల్సి వస్తుంది. అదే ప్యాశ్చరైజేషన్‌తో పాలల్లోని అధిక శాతం హానికారక బ్యాక్టీరియాలు నశిస్తాయి. కాబట్టి, పచ్చిపాల జోలికి వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Health and Telugu News

Updated Date - May 18 , 2024 | 06:21 PM