ఐపీఎల్‌ కీలక మ్యాచ్ రీషెడ్యూల్..  సేమ్ సీన్ రిపీట్..

క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ మార్చి 22న మొదలవనుంది. 

కొత్త ఎడిషన్‌కు టైమ్ దగ్గర పడటంతో అన్ని జట్లూ ప్రాక్టీస్‌లో బిజీబిజీ అయిపోయాయి.

ఈసారి ఐపీఎల్‌లో ఓ చిక్కు వచ్చి పడింది. లక్నో-కోల్‌కతా జట్ల మధ్య కీలక మ్యాచ్ రీషెడ్యూల్ కానుందని తెలుస్తోంది.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం.

శ్రీ రామ నవమి ఉండటంతో ఈ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. వేరే తేదీకి రీషెడ్యూల్ చేస్తారని వినిపిస్తోంది.

బెంగాల్ వ్యాప్తంగా ఆ రోజు భారీగా ఊరేగింపులు జరిగే చాన్స్ ఉండటంతో రీషెడ్యూల్‌ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారట లీగ్ నిర్వాహకులు.

గత ఐపీఎల్‌లో కేకేఆర్-రాజస్థాన్ మ్యాచ్‌ ఇలాగే శ్రీ రామ నవమి కారణంగా రీషెడ్యూల్ అయింది.