మొదటి రోజే IPL అభిమానులకు  బ్యాడ్ న్యూస్..

సీజన్ తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన వేదికగా జరగాల్సి ఉండటంతో ఇదే మైదానంలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభ వేడుక నిర్వహిస్తారు. 

ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం ఏర్పాట్లు చేయగా.. ఫ్యాన్స్ కూడా ఈ వేడుకను ఆస్వాదించేందుకు సిద్ధమయ్యారు.

కానీ కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశం ఉందన్న వార్త క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.

బంగాళాఖాతంలో వాతావరణ మార్పుల కారణంగా మార్చి 20 నుంచి 22 వరకు..

పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వర్షం పడటానికి 90 శాతం అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో ఐపీఎల్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.

మరోవైపు ఐపీఎల్ మొదటి మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో వరుణడి కరుణపైనే ఈడెన్ గార్డెన్‌లో మంగళవారం మ్యాచ్‌ ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు.