ఈ టెంపుల్స్ వెరీవెరీ స్పెషల్..  ఏడాదికోసారే దర్శనం..

మన దేశంలో కొన్ని ఆలయాలు వెరీ వెరీ స్పెషల్.. ఇక్కడ మాత్రం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఆలయాలను తెరుస్తారు.

ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. అటువంటి ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలోని రెండో అంతస్తులో ఉన్న శ్రీ నాగచంద్రేశ్వర ఆలయం  సంవత్సరానికి ఒకసారి అంటే నాగ పంచమి రోజున మాత్రమే తెరుచుకుంటాయి.

రాణి పోఖారి అంటే రాణి చెరువు. ఈ ఆలయ తలుపులు ప్రతి సంవత్సరం దీపావళి ఐదవ రోజున మాత్రమే తెరుచుకుంటాయని చెబుతారు

 కర్ణాటకలోని మంగళూరు నగరంలో ఉన్న మంగళ దేవి ఆలయం తలుపులు  సంవత్సరానికి ఒకసారి మాత్రమే తెరుచుకుంటాయి నవరాత్రి సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

హాసనాంబ ఆలయం: కర్ణాటకలో ఉన్న ఈ ఆలయం అంబా దేవికి అంకితం చేయబడింది. దీపావళి సమయంలో కూడా ఈ ఆలయ తలుపులు తెరుచుకుంటాయి.

ఏకలింగేశ్వర మహాదేవ ఆలయం: ఈ ఆధ్యాత్మిక ప్రదేశం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంది. ఈ ఆలయ తలుపులు సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజున మాత్రమే తెరుచుకుంటాయి.