బడా గణేషుడికి భక్తుల ఘనవీడ్కోలు..!

ఈ ఏడాది 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ బడా గణపతి భక్తులకు దర్శనమిచ్చాడు.

9 రోజుల పాటు పూజలందుకున్న బడా గణేష్‌ను గంగమ్మ ఒడికి సాగనంపడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  

ఉదయం ఐదున్నర గంటలకు చివరి పూజల అనంతరం ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది.

వెల్డింగ్ వర్క్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వరకూ సాగింది.

సరిగ్గా 1:21 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి ప్రశాంతంగా గంగమ్మ ఒడిని చేరుకున్నాడు.

ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన బాహుబలి క్రేన్ నంబర్ 4 వద్ద జరిగిన తుదిపూజలతో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి అయ్యింది.