Medium Brush Stroke

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపయ్య..

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ పంచముఖ సంకట హర మహా గణపతి నిమజ్జనం పూర్తైంది.

ట్యాంక్‌బండ్‌ వద్ద క్రేన్ నంబర్-4 సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణనాథుడిని నిమజ్జనం చేశారు.

మహాగణపతిని చివరిసారిగా దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

భక్తుల రద్దీతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

సెక్రటేరియట్ సౌత్‌ఈస్ట్ మార్గంలోనూ భారీగా జనసందోహం కనిపించింది.

అప్పర్ ట్యాంక్‌బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు అత్యంత కోలాహలంగా కొనసాగుతున్నాయి.

నిమజ్జన ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు మొత్తం 12 క్రేన్లను ఏర్పాటు చేశారు.

భద్రతా చర్యల్లో భాగంగా పోలీస్ కంట్రోల్ రూం ద్వారా 58 సీసీ కెమెరాలతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.

ప్రతి క్రేన్ వద్ద ఒక ఎస్‌ఐతో పాటు ఐదుగురు పోలీస్ సిబ్బందిని నియమించారు.

25 క్రైమ్ టీమ్స్, 10 షీ టీమ్స్ కూడా విధుల్లో పాల్గొన్నాయి.