నేటి రాశి ఫలాలు.. 21-09-2026

21-09-2026 సోమవారం

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వారి సహకారంలతో లక్ష్యాలు సాధిస్తారు. వేడుకలు, వివాహ విషయాలు పెద్దలతో చర్చిస్తారు. లక్ష్య సాధనలో భాగస్వామి సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

వృషభం (ఏప్రిల్‌ 21-మే 20 మధ్య జన్మించిన వారు) ప్రచురణలు, విద్య, కళా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. భవానీ శంకరుని ఆరాధన శుభప్రదం.

21-09-2026 సోమవారం

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు) చిన్నారులు, ప్రియతమలు కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. వైద్య సేవలకు అవసరమైన నిదులు సర్దుబాటు అవుతాయి. పాతబకాయిలు వసూలవుతాయి.

21-09-2026 సోమవారం

కర్కాటకం (జూన్‌ 22-జూలై 23 మధ్య జన్మించిన వారు) శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. కొత్తపరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాలకు ఏర్పాట్లు చేస్తారు. స్పెక్యులేషన్లు, పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

21-09-2026 సోమవారం

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు) ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. ఫార్మా, హోటల్‌, ఆహార పదార్థాల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

21-09-2026 సోమవారం

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు) చిన్నారుల విద్యా విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో చేరేందుకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.

21-09-2026 సోమవారం

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు) బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు. ఇల్లు, స్థలసేకరణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన నిర్ణయం విషయంలో పెద్లలు, తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది.

21-09-2026 సోమవారం

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు) విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు.

21-09-2026 సోమవారం

ధనుస్సు (నవంబరు 23-డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

21-09-2026 సోమవారం

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు) పెద్దలు, పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలమైన రోజు. పరమశివుని ఆరాధించండి.

21-09-2026 సోమవారం

కుంభం (జనవరి 21-ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు) దూర ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. చర్చలు, సమావేశాలు ఫలిస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రహస్య సమాచారం తెలుసుకుంటారు. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.

21-09-2026 సోమవారం

12-12-2024  గురువారం

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు) పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. .