కార్తీక మాసం.. మాస శివరాత్రి.. ఇలా చేయండి..
శత్రుబాధలు తొలగి పోవాలంటే ఖర్జూర పండ్ల రసంతో శివునికి అభిషేకం చేయాలి.
పనుల్లో ఆటంకాలు తొలగడానికి ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయాలి.
జాతకంలో నవగ్రహా దోషాలుంటే.. బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయాలి.
మనశ్శాంతి కోసం వెన్నతో అభిషేకం చేయాలి.
మహిళలకు దీర్ఘసుమంగళి యోగం కోసం ఈ మాస శివరాత్రి రోజు.. శివలింగంపై రాతి ఉప్పు ఉంచి నమస్కారం చేయాలని సూచిస్తున్నారు.
మాస శివరాత్రి రోజు.. పరమేశ్వరుడిని జిల్లేడు పూజలతో పూజించాలి.
కుటుంబంలో కలహాలు తొలగిపోయి.. మనశ్శాంతి లభించాలంటే ఆ రోజు సాయంత్రం కొబ్బరినూనెతో దీపం వెలిగించాలి.
శివునికి కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పట్టాలి.
శివుడికి పంచ సౌగంధికాలను తాంబూలంగా సమర్పించాలి. అంటే తమలపాకులో వక్కలు ఉంచి జాజికాయ, జాపత్రి, యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలను తాంబూలంగా సమర్పించాలి.
గ్రహ,నక్షత్ర దోషాలు పోవాలంటే.. ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని చదువుతూ శివునికి అభిషేకం చేయాలి.
మాస శివరాత్రి వేళ పరమ శివునికి ఇచ్చే నంది హారతి, నాగ హారతిని దర్శించుకోవాలి.
Related Web Stories
Today Horoscope: ఈ రాశి వారు స్థిర చరాస్తులకు సంబంధించిన చర్చల్లో నిదానం పాటించాలి.16-11-2025
మీ ఇంట్లో అప్పుల బాధలు తీరాలంటే మనీ ప్లాంట్ మొక్కను ఇలా పెంచండి
రోడ్డుపై బంగారం దొరికితే మంచిదేనా
నుదుటిపై కుంకుమ పెట్టుకుంటే లాభాలు ఏంటో తెలుసా