ఈ రోజు మంగళవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు వివిధ క్షేత్రాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఇచ్చిన లక్ష్మీ నరసింహ స్వామి వారిని చూడటానికి భారీగా భక్త జనం తరలి వచ్చారు.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు, ఈవో వెంకట్రావు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.