వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలంటే..

 ఈ ఏడాది ఈ ముక్కోటి ఏకాదశి.. డిసెంబర్ 30వ తేదీ మంగళవారం వచ్చింది. ఈ రోజున వైకుంఠం ద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతాయి.

వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని అంటారు

ఈ రోజు ఆలయంలోకి ఉత్తరద్వారం ద్వారా వెళ్లి.. శ్రీమహావిష్ణువును దర్శించుకుంటే సమస్త పాపాలు పోవడమే కాకుండా జన్మరాహిత్యం సైతం లభిస్తుందంటారు.

శ్రీమహావిష్ణువుకు తులసి అంటే అత్యంత ప్రీతికరం. ఈ రోజు తులసి ఆకులు కోయడం మంచిది కాదు. ఈ రోజు ఆ నారాయణుడికి తులసిని సమర్పించాలి. ముక్కోటి ఏకాదశి ముందు రోజే తులసి ఆకులు కోసి.. పూజకు సిద్ధం చేసుకోవాలి.

ఈ రోజు.. అన్నం, బియ్యంతో చేసిన ఆహార పదార్థాలు తిన వద్దంటారు.

ఈ రోజు అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. పేదలకు, లేనివారికి తూచిన వాటిని దానంగా ఇస్తే పుణ్యం కలుగుతుంది.

ఈ రోజు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. ఈ రోజు ఈ నామాన్ని జపించడం వల్ల అనుకున్న కార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు.