సాధారణంగా, చాలా మంది తమ చేతులు, కాళ్ల వేళ్లలోని గోర్లు ఎక్కువగా సెలవుదినాల్లోనే కత్తిరించుకుంటారు.
హిందూమతంలో గోర్లు కత్తిరించేందుకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఏ రోజు కత్తిరించుకోవాలి, ఏ రోజు కత్తిరించకూడదో స్పష్టంగా తెలియజేస్తారు.
సూర్యాస్తమయం సమయంలో గోళ్లను కత్తిరించకూడదు. అంతేకాకుండా రాత్రిపూట కూడా కత్తిరించకూడదు.
సోమవారం: ఈ రోజున గోళ్లను కత్తిరిస్తే తమోగుణం తొలగిపోతుంది. అంటే సోమరితనం, నిద్ర, ఇతరుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం, దుర్మార్గపు ఆలోచనలు, తిండి ధ్యాస వంటి తొలగిపోతాయి.
మంగళవారం: ఈ రోజున గోళ్లను కత్తిరించడం ఏ మాత్రం మంచిది కాదు. పొరపాటున కట్ చేస్తే ఆయుష్ తగ్గిపోతుందని జ్యోతిష్యం చెబుతుంది.
బుధవారం: ఈ రోజు గోళ్లు కత్తిరించడం చాలా మంచిది. గోళ్లు కత్తిరించడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది.
గురువారం: ఈ రోజు గోళ్లు కత్తిరించడం మంచిది. అలా చేయడం వలన మనిషిలో మంచి లక్షణాలు పెరుగుతాయి.
శుక్రవారం: అన్ని రోజులతో పోలిస్తే ఈ రోజు గోళ్లు కత్తిరించడం చాలా ఉత్తమం. ఇలా చేయడం వలన జీవితంలో సంబంధాలు బలపడతాయి.
శనివారంనాడు గోర్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం వల్ల శనిదేవుడికి కోపం వస్తుంది. మీకు ఆర్థికంగా నష్టపోయి పేదరికం అనుభవిస్తారు.
ఆదివారం: ఈ రోజున గోళ్లు కత్తిరించకూడదు. అలా చేయడం ద్వారా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అంతేకాకుండా అమావాస్య తిథిలలో కూడా గోళ్లు కట్ చేయడం ఏ మాత్రం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.