ఈ రాళ్లు వజ్రాల కంటే కూడా ఖరీదైనవి..!

బెనిటోయిట్.. కాలిఫోర్నియాలో అరుదుగా కనిపించే నీలిరంగు రత్నమిది. దీని రంగు, ఆకర్షణ కారణంగా ఇది అత్యంత విలువైనదిగా నిలుస్తోంది.

బెరెడ్ బెరిల్.. యుఎస్ఎలోని ఉటాలో ఎరుపు రంగులో ఉండే ఈ రత్నాన్ని కనుక్కున్నారు. చాలా అరుదుగా లభ్యమవుతుండటంతో దీని ధర చాలా ఎక్కువగా ఉంది.

పరైబా టూర్మాలిన్.. నీలం ఆకుపచ్చ రంగుల కలయికలో కనిపించే ఈ రత్నం చాలా విలువైనది. టూర్మాలిన్  లో లభించే అత్యంత విలువైన రకాల్లో ఇది కూడా ఒకటి.

బ్లూ గార్నెట్.. బ్లూ గార్నెట్ అనేది అరుదైన గోమేదికం. ఇది రంగు మారుతూ కనిపిస్తుంది. పగటిపూట నీలం ఆకుపచ్చ నుండి కాంతివంతం అయ్యే కొద్దీ ఊదా ఎరుపు రంగుకు మారుతుంది.

పైనైట్.. పైనైట్ చాలా అరుదైన ఖనిజం.  ఒకప్పుడు ప్రపంచంలోనే అరుదైన రత్నంగా ఇది పరిగణించబడింది.

పింక్ స్టార్ డైమండ్.. పింక్ స్టార్ డైమండ్ ఇప్పటివరకు కనుగొనబడిన అతిపెద్ద, అత్యంత విలువైన గులాబీ వజ్రాలలో ఒకటి.

ముస్గ్రా వైట్.. ముస్గ్రా వైట్ వజ్రాల కంటే అరుదైన, విలువనైనదిగా పరిగణించబడుతుంది.

బ్లాక్ ఒపాల్.. బ్లాక్ ఒపాల్ లోతైన, ఆరప్షణీయమైన  రంగు వాటిని వజ్రాల కంటే విలువైనవిగా నిలబెడుతున్నాయి.