ఈ తప్పులు మానెయ్యండి..  బరువు తగ్గించుకోండి!

భోజనం ప్లేట్ ముందు కనీసం 20 నిమిషాల పాటు కూర్చుని తింటేనే మన కడుపు నిండినట్టు మెదడుకు సిగ్నల్ వెళ్తుంది. 

ఆహారాన్ని వేగంగా తినే అలవాటు ఉంటే మానుకోండి. చాలా బాగా నమిలి తినండి.

భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మెటబాలిజమ్ తగ్గిపోతుంది. ఫలితంగా శరీరంలో ఎక్కువ క్యాలరీలు చేరిపోతాయి. 

తగినంత నీరు తాగకపోవడం వల్ల కూడా ఎక్కువ ఆకలి వేస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా నీళ్లు తాగుతుండాలి.

తినేటపుడు టీవీ లేదా మొబైల్ ఆఫ్ చేసెయ్యాలి. వాటిని చూస్తూ తినడం వల్ల అనుకున్న దాని కంటే ఎక్కువ తినేస్తుంటాం. 

సరైన సమయంలో భోజనం చెయ్యకపోతే ఆకలి పెరిగిపోతుంది. ఆ తర్వాత తినేటపుడు ఎక్కువ తినేస్తుంటాం

శారీరక శ్రమకు తగ్గట్టే భోజనాన్ని ఎంచుకోవాలి. ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం తక్కువగా, రాత్రి మితంగా ఆహారం తీసుకోవాలి. 

భోజనం తిన్న వెంటనే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. స్వీట్లు, వేపుడు పదార్థాల జోలికి అసలు వెళ్లకూడదు

బయటి రెస్టారెంట్లు, హోటళ్లలో తినడాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి. ఇంటి ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి