జుట్టు మందంగా పెరగాలంటే తినాల్సిన 9 ఆహారాల లిస్ట్ ఇదీ..!

పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్-ఎ, సి సమృద్దిగా ఉంటాయి. ఇవి కుదుళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

చిలగడదుంపలలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి విటమిన్-ఎ గా రూపాంతరం చెందుతుంది. జుట్టు మందంగా పెరగడానికి సహాయపడుతుంది.

క్యారెట్లలో కూడా బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు మూలాలను ఆరోగ్యంగా మార్చి మందంగా పెరిగేలా చేస్తుంది.

బెల్ పెప్పర్స్ లో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జుట్టు తంతువులు బలోపేతం చేస్తుంది.

బ్రోకలీలో విటమిన్-ఎ, సి ఉంటాయి. ఫోలేట్ కూడా ఉంటుంది. జుట్టు కుదుళ్ళను, జుట్టు పెరుగుదలను మెరుగ్గా ఉంటే సెబమ్ ఉత్పత్తి చేస్తుంది.

కాలే అనే ఆకుకూరలో విటమిన్-ఎ,సి ఉంటాయి. జుట్టు కుదుళ్లకు సహజంగా నూనె సప్లై కావడంలోనూ, జుట్టు విరిగిపోకుండా కాపడటంలో ఇది సహాకరిస్తుంది.

బఠానీలలో విటమిన్-సి, కె పుష్కలంగా ఉంటాయి. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

గుమ్మడి గింజలలో బీటా కెరోటిన్, విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తైన, బలమైన జుట్టుకు సహకరిస్తాయి.

అవకాడోలో విటమిన్-ఇ పుష్కలంగా ఉంటుంది.  ఇది జుట్టు కుదుళ్లకు బ్లడ్ సర్క్యలేషన్ పెంచుతుంది.